Sai Pallavi Craze: సాయిపల్లవి. అచ్చం తెలంగాణ అమ్మాయిలా ఉండే ఈమె దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె అందం, అభినయం ఒక సాధారణ అమ్మాయిలా కనిపిస్తోంది. ప్రేక్షకుల్లో మన అనే భావన కేవలం సాయిపల్లవిని చూస్తేనే ప్రేక్షకుల్లో కలుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక సాయిపల్లవి కూడా అందరు హీరోయిన్లలా వల్గర్ గా డ్రెస్సులు అస్సలు వేసుకోదు. నీట్ గా మన తెలుగింటి ఆడపిల్లలా ఆమె వస్త్రాధారణ ఉంటుంది. సినిమాల్లోనూ ఓవర్ గ్లామర్, లిప్ టు లిప్ కిస్ లకు దూరంగా ఉంటుంది. హీరోయిన్ పాత్రలకు ఇంపార్టెన్స్ ను బట్టి మాత్రమే కథలను ఎంచుకుంటుంది. ఏకంగా చిరంజీవి లాంటి అగ్రహీరో ఆఫర్ చేసినా కూడా కథ ప్రాధాన్యత లేకుంటే రిజెక్ట్ చేసిన ఘనత సాయిపల్లవి సొంతం.
సాయిపల్లవి సింప్లిసిటీ, క్రమశిక్షణ, విలువలే ఆమెను సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన హీరోయిన్ గా నిలిపింది. అందరు హీరోయిన్లకు భిన్నంగా ప్రమోషన్లకూ ఈమె అందుబాటులో ఉండి ఎక్స్ ట్రా రెవ్యూనరేషన్ ఏమీ తీసుకోకుండా నిర్మాతల ఫ్రెండ్లీ హీరోయిన్ అనిపించుకుంటుంది. ఎంతో అణకువ, లౌక్యం ఉన్న ఇలాంటి హీరోయిన్లు చాలా అరుదుగా ఇండస్ట్రీలో కనిపిస్తారు. అలాంటి వారిలో మన సాయిపల్లవి ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు.
-సాయిపల్లవి బయోగ్రఫీ
సాయిపల్లవిది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నృత్యకళాకారిణి. అందుకే కూతురు సాయిపల్లవికి డ్యాన్స్ నేర్పించింది. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. సాయిపల్లవి, చెల్లెలు పూజ కవల పిల్లలు. కోయంబత్తూరులో పాఠశాల విద్యను సాయిపల్లవి అభ్యసించింది. 8వ తరగతిలో సాయిపల్లవి డ్యాన్స్ చూసి ఓ దర్శకుడు ‘ధూంధాం’ అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మీరాజాస్మిన్ క్లాస్ మేట్ గా ‘కస్తూరి మాన్’ అనే సినిమాలో సాయిపల్లవి నటించింది. ఈటీవీ ఢీ డ్యాన్స్ లోనూ పాల్గొంది. ఆ తర్వాత చదువుపై దృష్టి సారించి జార్జియాలో వైద్యవిద్యను పూర్తి చేసింది.
వైద్యవిద్య అనంతరం సాయిపల్లవిని ‘ప్రేమమ్’ చిత్రంలో దర్శకుడు అల్ఫోన్సో అవకాశం ఇచ్చాడు. అలా హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో ఫిదా, ఎంసీఏ , విరాటపర్వం తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది.
ఈ క్రమంలోనే సాయిపల్లవి అంటే అందరికీ ఎంతో అభిమానం ఏర్పడింది. మనలో కలిసిపోయే అమ్మాయిలో ఆమె నడవడిక, వేష, భాష ఉండడంతో తెలుగు జనాలు ఓన్ చేసుకున్నారు. ఇంతలా సాయిపల్లవిలో తెలుగు జనాలకు నచ్చిన ఆంశాలేంటి? ఆమెను ఎందుకు గౌరవిస్తున్నారన్న దానిపై స్పెషల్ ఫోకస్..
1. పక్కింటి అమ్మాయి ఇమేజ్
సాయిపల్లవిని చూస్తే ముంబై నుంచో ఉత్తరాధి నుంచి వచ్చిన హిందీ భామ అన్న ఫీలింగ్ అస్సలు కలగదు. మన ఇంట్లోనే పుట్టిన.. లేదా పక్కింట్లో కనిపించే అమ్మాయిలా కనిపిస్తోంది. ఆమెలో ఆ హంగు ఆర్భాటాలు కూడా ఏమీ ఉండవు. సినిమాల్లో, బయటా ఎక్కడా హీరోయిన్లలా బికినీలు, అర్ధనగ్న డ్రెస్సులు, అసౌకర్యంగా కనిపించడం ఇప్పటివరకూ చూసి ఉండరు. అంతా హుందా సినిమాల్లోనూ.. బయటా కనిపిస్తారు. సాయిపల్లవిని చూడగానే మనలో ఒక అమ్మాయిలా అగుపిస్తుంది. ఆమె వేష,భాష కూడా చాలా హుందాగానే ఉంటుంది. అదే తెలుగు జనాలకు సాయిపల్లవిని చేరువ చేసింది. గుండెల్లో పెట్టుకునేలా చేసింది.
Also Read: Raja Mouli Sye Movie: రాజమౌళి ‘సై’ చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా??
2. అద్భుతమైన డాన్సర్
సాయిపల్లవి అంటే ఒక అద్భుతమైన డ్యాన్సర్.ఈటీవీ ఢీ షోలో పార్టిసిపెంట్ గా మొదలైన ఆమె డ్యాన్స్ ప్రస్థానం సినిమాల్లో స్టార్ హీరోలకు చమటలు పట్టించేదాకా ఎదిగింది.సాయిపల్లవితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం అనే వాళ్లు ఉన్నారు. అంతలా హీరోలను తలదన్నేలా ఆమె డ్యాన్స్ చేస్తుంది. ‘రౌడీ బేబీ’ సాంగ్ లో తమిళ హీరో ధనుష్ ను మించి చేసి ప్రశంసలు అందుకుంది. ఆమె నడుం ఒంపులు తిప్పడం.. డ్యాన్స్ ను పతాకస్థాయికి తీసుకెళ్లడం ఆమెకే చెల్లింది. ఒకనొక సందర్భంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సైతం తాను ఒక సారి డ్యాన్స్ లో ‘సాయిపల్లవి’తో పోటీపడాలనుకుంటున్నట్టు స్టేజీమీదే ప్రకటించడం ఆమె క్రేజ్ కు ఉన్న నిదర్శనం..
3. విలువలకి పెద్దపీట వేయడం ( డ్రెస్, ప్రకటనలు).. డబ్బుల కోసం పనిచేయకపోవడం..
సాయిపల్లవి అందరిలాంటి హీరోయిన్ కాదు. అందరిలా బికినీలు వేసుకోదు. అర్థనగ్నంగా కనిపించదు. నడుం చూపించదు. సంప్రదాయబద్ద దుస్తులే వేసుకుంటుంది. సినిమాల్లో అయినా.. బయటా అయినా ఆమె అసభ్యతకు దూరంగా ఉంటుంది. లిప్ కిస్ లు, ముద్దులు మురిపాలు, రోమాన్స్ సీన్లకు దూరం. కథా బలం ఉండి.. మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలే ఎంచుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ ఇచ్చినా కూడా కథ ప్రాధాన్యత లేదని సాయిపల్లవి రిజెక్ట్ చేసిందన్న ప్రచారం సాగింది. ఇక ప్రజలను తప్పుదోవ ప్రకటించే అడ్వటైజ్ మెంట్స్ లోనూ నటించదు. గుట్కా, మద్యం సహా పొగాకు సహా ప్రజలకు నష్టం చేసే ఏ ప్రకటన కర్తలు అయినా కోట్లు ఇస్తామన్నా కూడా సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ఘనత ఆమె సొంతం. ఈ కాలంలో డబ్బులిస్తే ఏం చేయడానికైనా వెనుకాడని హీరోయిన్లు ఉన్న రోజుల్లో ఇలా విలువలతో బతకడం అంటే అది సాయిపల్లవికే చెల్లింది.
4. వివాదాలకు దూరంగా ఉండడం..
ఇక సాయిపల్లవి సినిమాలు ఉన్నా.. లేకపోయిన తన కుటుంబంతో సాదాసీదా జీవితం గడుపుతుంది. సినిమా ఇండస్ట్రీలో అయినా బయటా అయినా వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. తన పాత్ర, నటన వరకే పరిమితం అవుతుంది. అంతేకానీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని నిర్మాతలు, దర్శకులు, హీరోలతో గొడవలు పెట్టుకున్న దాఖలాలు లేవు. ప్రమోషన్లకు కూడా ఎక్స్ ట్రా ఏం రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉచితంగా పాల్గొనే గొప్ప మనసు సాయిపల్లవి సొంతం. సినిమా అయిపోందనగానే వదలకుండా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దర్శక నిర్మాతలకు అన్ని వేళల సహకరించే మంచి మనసు సాయిపల్లవి సొంతం
5. ఎవరితోనైనా కొంత లిమిట్ లో ఉండడం ( లింక్ అప్ రూమర్స్ తక్కువ)
ఇక సాయిపల్లవి ఇన్ని సినిమాల్లో నటించినా ఏ హీరోతోనూ ఎఫైర్స్ పెట్టుకున్నట్టు.. సన్నిహితంగా మెలిగినట్టు.. చట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు ఎక్కడా ప్రచారం సాగలేదు. సినీ ఇండస్ట్రీలో ఇలా సినిమా చేయగానే అలా రూమర్స్ వస్తుంటాయి.కానీ సాయిపల్లవి విషయంలో ఇలాంటి ఏవీ రావు. ఎందుకంటే ఆమె ఎవరితోనైనా కొంత లిమిట్ లోనే ఉంటుంది. అదే ఆమెపై రూమర్స్ తక్కువగా రావడానికి కారణమైంది. తన పని ఏదో తాను చేసుకొని సర్దుకుపోయే మనస్తత్వమే సాయిపల్లవికి క్లీన్ నీట్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.
6. పెద్దలకి, యువతరానికి, పిల్లలకు… అందరికీ నచ్చే లక్షణాలు ఒకరిలోనే ఉండడం.
ఒక మంచి అమ్మాయి ఎలా ఉండాలంటే ఆమె అన్ని వర్గాల వారికి నచ్చాలి. ఈ విషయంలో అల్లరి, తుంటరి, కొంటె సాయిపల్లవి అందరికీ ఇష్టమైంది. ఆమె కలివిడితనమే పెద్దలు, యువతరం, పిల్లలకు చేరువ చేసింది. అందరికీ నచ్చేలా కట్టుబొట్టు, వ్యవహారశైలి ఉండడంతో ఆ లక్షణాలనే సాయిపల్లవిని విలక్షణ వ్యక్తిత్వంగా మార్చాయి. అందరికీ చేరువ చేశాయి.
7. డాక్టర్ చదివిన తర్వాత ఇండస్ట్రీ లోకి రావడం
డాక్టర్ చదివి అనుకోకుండా యాక్టర్ అయిన వారు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ మొదటి నుంచి కళలపై ప్రేమతోనే సాయిపల్లవి జీవించింది. కళలపై ప్రాణం పెట్టింది.తల్లి డ్యాన్సర్ కావడంతో డ్యాన్స్ నేర్చుకొని ఈటీవీ ఢీ షోలో మెరిసింది. ఆ తర్వాత తండ్రి ఒత్తిడితో వైద్యవిద్యను అభ్యసించడానికి జార్జియా దేశం వెళ్లినా తన కళను చంపుకోలేదు. ఆ చదువు పూర్తికాగానే ‘ప్రేమమ్’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడంతో డాక్టర్ చదివినా కూడా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఫ్యాషన్ తోనే సినీ పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు అగ్రహీరోయిన్ గా ఎదిగి తను ఎంచుకున్న రంగం కరెక్టేనని అందరికీ నిరూపించింది.
మొత్తంగా సాయిపల్లవి అంటే ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం ఉండి అందరినీ అలరించే ఆకట్టుకునే ఒక మహిళగా చెప్పొచ్చు. ఆమె హీరోయిన్ గా సక్సెస్ కావడానికి ఈ విభిన్న లక్షణాలే దోహదం చేశాయి. అందరిలా గ్లామర్ ఒలకబోయపోయినా.. అందంగా లేకపోయినా ఆ నేచురాలిటీయే ఆమెను ప్రజలకు చేరువ చేసింది. అగ్రతారగా ఎదిగేలా చేసింది. అందరి అభిమానం చూరగొనేలా చేసింది.
Also Read:Virata Parvam Real Story: విరాటపర్వం అసలు కథ ఇదే.. సాయిపల్లవి పాత్ర క్లైమాక్స్ షాకింగ్
Recommended Videos
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What is the reason for the craze over the actress sai pallavi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com