Manchu Family Issue : మోహన్ బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి నటుడు క్రమశిక్షణకు పెట్టింది పేరుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే తన కొడుకులు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఎదగాలనే ఒక కారణంతో వాళ్ళ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరికి కూడా సరైన సక్సెస్ అయితే పడలేదు. ఇక దాంతో మంచు మనోజ్ గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికి మంచు విష్ణు మాత్రం అడపదడపా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే వాళ్ల ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి చాలా గౌరవమైతే ఉండేది.
కానీ గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాత్రం మోహన్ బాబు ఫ్యామిలీ మీద ప్రతి ఒక్కరికి గౌరవమైతే పోతుంది. ఎందుకు అంటే తన కొడుకుల మధ్య విభేదాలు రావడం ఫ్యామిలీ విషయాల్లో మోహన్ బాబు కూడా కొంచెం అగ్రెసివ్ బిహేవ్ చేయడం వంటివి చూస్తుంటే ఇందులో మోహన్ బాబు తప్పు కూడా ఉంది అంటూ కొంతమంది విమర్శకులు విమర్శలు చేస్తున్నారు…
ఇక ఇదిలా ఇలా ఉంటే రీసెంట్ గా మంచు మనోజ్ మీద మోహన్ బాబు తన అనుచరుడితో దాడి చేయించాడు అంటూ కొన్ని గాయాలతో ఆయన హాస్పిటల్ లో చేరిన విషయం మనకు తెలిసిందే… నిజంగానే మోహన్ బాబు మంచు మనోజ్ ని కొట్టించాడా? అసలు ఈ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒకే ఫ్యామిలీలో ఉన్న వీళ్ళ మధ్య తరచూ వివాదాలు ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
మంచు విష్ణు హీరోగా పలు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే విష్ణు మనోజ్ మధ్య తరచుగా ఆస్తికి సంబంధించిన విభేదాలు తలెత్తుతున్నాయి. మోహన్ బాబు స్థాపించిన విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించిన ఆస్తి వివాదాల కారణంగానే గొడవలు జరుగుతున్నాయి అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా గత కొన్ని రోజుల నుంచి విష్ణుకి మనోజ్ కి మధ్య విభేదాలైతే ఉన్నాయి. ఇక ఒక సంవత్సరం కిందట మేనేజర్ సారధి విష్ణు ను అడ్డుకుంటున్నప్పటికీ మంచు మనోజ్ ను కొట్టడానికి తన ఇంటికి వచ్చాడు ఆ విషయాన్ని మనోజ్ వీడియో తీసి మరి అప్లోడ్ చేశాడు.
దాంతో అప్పుడు మంచు విష్ణు తీవ్రమైన వివాదాలను ఎదుర్కొన్నాడు. ఇక అప్పుడు మోహన్ బాబు కూడా కొన్ని వివాదాలను ఎదుర్కొన్నాడు.ఇక ఆ తర్వాత మంచు విష్ణు అది ప్రాంక్ అని చెప్పడం మోహన్ బాబు మనోజ్ ని బ్రతిమిలాడి మరి ఆ వీడియోను డిలీట్ చేయించడం చేశారు. అయినప్పటికీ మనోజ్ మాత్రం అప్పటినుంచి వాళ్ళ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి ఆయన తన ట్విట్టర్ వేదికగా పలు రకాల ట్వీట్లు చేస్తున్నాడు. నన్ను ‘కామ్ గా బతకనివ్వండి’ అంటూ ఆయన చేసిన ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి… ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా ఈ గొడవ కూడా జరగడం అందులోనూ మనోజ్ 100 కి దయాళ్ చేసి మా నాన్న అయిన మోహన్ బాబు తన అనుచరుడు అయిన వినయ్ తో నన్ను కొట్టించాడు అంటూ స్వయంగా మనోజ్ పోలీసులకు చెప్పడం ద్వారా ఈ విషయం మీడియాకి లీక్ అయింది.
ఇక మనోజ్ తన స్నేహితుడు అలాగే తన భార్య సహాయంతో ఆస్పత్రిలో జాయిన్ అవ్వడం వంటివి జరిగిపోయాయి. ఇక ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మోహన్ బాబు కూడా ఆస్తి విషయాల్లో మొదటి నుంచి విష్ణు కే ఎక్కువగా సపోర్ట్ చేస్తు వస్తున్నడంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇందులో మోహన్ బాబు తప్పే ప్రధానంగా కనిపిస్తుందంటూ ఇంకొంత మంది వాపోతున్నారు.
మోహన్ బాబు విష్ణు ఇద్దరికి మనోజ్ భూమా మౌనిక రెడ్డి ని పెళ్లి చేసుకోవడం నచ్చలేదని అందుకే వాళ్ళు అప్పటి నుంచి మనోజ్ ను కూడా తమలో కలుపుకోవడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి… ఇక దానివల్లె ఈ దాడి జరిగిందని కొంతమంది చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు మాత్రం ముందుగా మనోజే తనని కొట్టడానికి వచ్చారని ఆ తర్వాత తను దాడి చేసిను అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా మంచు ఫ్యామిలీ ఇలా వివాదాలతో రొడ్డెక్కడం ఎవ్వరికీ నచ్చడం లేదు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: What is the real reason for the conflicts in the manchu family who does mohan babu support
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com