Poonam Kaur- Fibromyalgia: పురుషుల కంటే మహిళల్లోనే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు రోజు దైనందిన కార్యక్రమాల్లో భాగంగా వారు చేసే పనులే వారికి రక్షణగా నిలుస్తాయి. శారీరకంగా, మానసికంగా మగవారి కంటే ఆడవారే బలంగా ఉంటారు. దీంతో వారి ఆరోగ్యమే వారికి అండగా నిలుస్తుంది. అందుకే పురుషులకంటే వారే ఎక్కువ కాలం జీవిస్తారు. కానీ ఇటీవల కాలంలో మహిళలను కొన్నిరకాల వ్యాధులు బాధిస్తున్నాయి. దీంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా వారికి వచ్చే రోగాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది.

ఇటీవల కాలంలో హీరోయిన్లకు సైతం పలు రకాల జబ్బులు వేధిస్తున్నాయి. డిప్రెషన్, మాయోసైటిస్ వంటి వాటితో బాధ పడుతున్నారు. ఈ మధ్య ఇంకో కొత్త వ్యాధి వచ్చి చేరింది. అదే పైబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధి వారిని బాధిస్తోంది. పూనమ్ కౌర్ కు వచ్చిన వ్యాధి కూడా ఇదే అని చెబుతున్నారు. సమంత కూా మాయో సైటిస్ సమస్య నుంచి కోలుకుంది. తాజాగా పూనమ్ కౌర్ ఫైబ్రోమైయాల్జియా వ్యాధితో సతమతమవుతుంటే కథానాయికలకు భయం కలుగుతోంది.
ఫైబ్రోమైయాల్జియా వ్యాధి ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏంటి అంటే మెదడు, వెన్నెముకపై ప్రభావం చూపుతుంది. నొప్పి కలిగించే సంకేతాలు కనిపిస్తాయి. సర్జరీ, ఇన్ఫెక్షన్ లేదా మానసిక ఒత్తిడి వంటి వాటి ద్వారా వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. ఇది మగవారితో పోలిస్తే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. టెన్షన్, తలనొప్పి, టెంపోరోమండిబ్యులర్ జాయింట్ (తాత్కాలిక ఎముక, దిగువ దవడ) రుగ్మతలు, పేగు సంబంధించిన రుగ్మతలు, ఆందోళన, డిప్రెషన్ కలిగి ఉండటం కనిపిస్తుంది. దీనికి ఇంతవరకు మందు లేదు. చికిత్స ఒక్కటే మార్గం. వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం, విశ్రాంతిగా ఉండటం వంటి ద్వారా వ్యాధిని తగ్గించుకోవచ్చు.
ఫైబరోమైయాల్జియా వ్యాధి లక్షణాల్లో భాగంగా శరీరం ముందు, వెనుక భాగాల్లో నొప్పులు, నడుము కింద, నడుము పై భాగంలో నొప్పులు వస్తాయి. సరైన నిద్ర పోతున్నా అలసట కలుగుతుంది. శ్రద్ధ, ఏకాగ్రత వంటి వాటిని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక అలసట, పేగు సంబంధిత వ్యాధులు, తలనొప్పి, మూత్రాశయ సమస్యలు, డిప్రెషన్, ఆందోళన వంటివి వేధిస్తాయి.

ఈ వ్యాధి రావడానికి కారకాలు మెదడు, వెన్నుపాములో మార్పులు వస్తాయి. నొప్పి కలిగించే కారకాలు ఎక్కువవుతాయి. జన్యుపరమైన కారణాలతో ఈ వ్యాధి వస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణాలవుతాయి. కారు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు భావోద్వేగ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి కూడా ఈ వ్యాధి రావడానికి కారణమవుతుంది.
ఈ వ్యధి పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా వస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే మిగతా వారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లియితే కూడా ఇది సంక్రమిస్తుంది. కీళ్ల వాతము, చర్మ సంబంధిత వ్యాధులు వంటివి ఇది రావడానికి దోహదం చేస్తాయి. ఈ వ్యాధి సోకితే నిద్ర పట్టదు. పనులు చేసుకోవడం కష్టమవుతుంది. ఏ పని చేయబుద్ధి కాదు. తరచుగా అపార్థం చేసుకుంటారు. డిప్రెషన్, ఆందోళన వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి.