Pawan Kalyan Luxary Bike పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజం టాలీవుడ్ లో ఎవరికీ లేదు. ఆయన మెడ వెనుక చేయి పెట్టి ‘ఆ.. ’ అన్నారంటే ఫ్యాన్స్ ఈలలు గోలలు చేయాల్సిందే. పవన్ లోని మాస్ మసాలాను సరిగ్గా ప్రజెంట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఒక స్టైలిష్ ఐకాన్ గా కూడా పవన్ ను అందరూ గుర్తిస్తారు.

కానీ పవన్ లోని సామాజిక కోణం.. ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ఆయన ఎక్కువగా ఈ ఆడంబరాలకు దూరంగా ఉంటారు. లగ్జరీ లైఫ్ ను పక్కనపెట్టి హైదరాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో ఆవులకు సేవ చేస్తూ వ్యవసాయం చేస్తుంటారు.
ప్రస్తుతం ఏపీలో అధికారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఒక సూపర్ బైక్ పై ఠీవీగా స్టైలిష్ గా వెళుతున్న బైక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఓ భారీ సెట్ వేసి అందులో ఆర్టిస్టులతో కలిసి పవన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1000 మంది ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్.. అత్యంత ఖరీదైన సూపర్ మోడల్ బైక్ ‘బీఎండబ్ల్యూ ఆర్1250 జీఎస్’పై ఫిల్మ్ సిటీలో చక్కర్లు కొట్టారు. ఈ వీడియో కొందరు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. షూటింగ్ విరామ సమయంలో ఈ ఖరీదైన బైక్ వేసుకొని పవన్ కళ్యాణ్ సరదాగా రైడ్ చేసినట్టు తెలిసింది. లగ్జరీ బైక్ పై పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీన్ని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ఇక ఈ లగ్జరీ బైక్ ఏంటది? ఎంత రేట్ ఉంటుందని అందరూ ఆరాతీస్తున్నారు. ఈ బీఎండబ్ల్యూ బైక్ ఖరీదు అక్షరాల రూ.24 లక్షల రూపాయలు. విదేశాల్లోనే ఇది దొరుకుతుంది. ఇండియాకు దిగుమతి చేసుకొని వాడుతున్నారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ కొన్న బైక్ నా? లేక వేరే ఎవరిదైనా నడిపారా? అన్నది తెలియాల్సి ఉంది.