Hero and Villain : హీరో అంటే తోపు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాడు. సింగిల్ హ్యాండ్ తో సిచుయేషన్ కంట్రోల్ చేసేస్తాడు. వొంటించేత్తో వొంద మందిని వొంగబెడతాడు. దాదాపుగా అందరి ఫీలింగ్ ఇదే.. కానీ నిజం వేరే…
సినిమాలు చూసి అందరూ అలా ఫిక్స్ అయ్యారు గానీ.. విలనిజం ముందు హీరో నిలబడలేడు. ఆ వేవ్ ధాటిని తట్టుకు నిలబడ్డం బాహుబలికి కూడా దుస్సాధ్యమే. బేసిగ్గా విలనిజంలో ఉన్న POWER అటువంటిది మరి. సినిమాలు చూసి చూసి.. సొసైటీ చెప్పిన ఇంపోజిషన్ రాసి రాసి విలనిజంపై ఒక నెగెటివ్ ఇంప్రెషన్ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది తప్ప, నిజానికి విలనే HERO.
నీలో ఉంటాడు విలన్. నాలోనూ ఉంటాడు విలన్. విలనిజం Nothing But A Feeling. ప్రతికూల పరిస్థితులే మనిషిని అలా మార్చేస్తాయి. అప్పుడు మనసులో ఉద్భవించే ఆ Negative Feeling పవర్ ఎంత ఉంటుందో తెలుసా? పాజిటివిటీ కన్నా..
వందల వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాని ముందు హీరోయిజం మనలేదు. హీరోయిజాన్ని కొలవడానికి Measures ఉంటాయి. But.. విలనిజాన్ని కొలవడానికి కొలతలు సరిపోవు.
ఇంతటి పవర్ ఉన్న విలనిజాన్ని సరైన పద్ధతిలో ఎక్కుపెడితే.. నీ ఎదురు నిలవడం అసాధ్యం.. పరిస్థితులకైనా..! ప్రత్యర్థులకైనా..!!
-రాధా