Sharwanand Marriage: గాడ్ ఫాదర్స్ లేకుండా పరిశ్రమలో హీరోగా ఎదిగిన వాళ్లలో శర్వానంద్ ఒకరు. అయితే మెగా ఫ్యామిలీ సప్పోర్ ఆయనకు ఉందంటారు. శర్వానంద్-రామ్ చరణ్ క్లాస్ మేట్స్. అలా సినిమాల్లోకి రాకముందే చిరంజీవితో శర్వానంద్ కి పరిచయం ఉంది. కెరీర్ బిగినింగ్ లో శర్వానంద్ శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో ఒక చిన్న రోల్ చేశాడు. సప్పోర్టింగ్ రోల్స్ చేస్తూ టాలెంట్ నిరూపించుకుని హీరో అయ్యాడు. టైర్ టూ హీరోల లిస్ట్ లో చోటు సంపాదించిన శర్వానంద్ తనకంటూ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు.

ఆయన నటించిన గమ్యం, ప్రస్థానం చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు వంటి కమర్షియల్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే రెండు మూడేళ్ళుగా శర్వానంద్ సరైన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నారు. ఆయన లేటెస్ట్ రిలీజ్ ఒకే ఒక జీవితం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. ఓపెనింగ్స్ అందుకున్న ఆ చిత్రం స్ట్రాంగ్ రన్ కొనసాగించలేకపోయింది.
ఇక శర్వానంద్ ప్రస్తుత వయసు 38 ఏళ్లు. అంటే పెళ్ళికి ఏజ్ బార్ అయినట్లే లెక్క. కెరీర్ మీద ఫోకస్ పెట్టి పెళ్లి విషయం మర్చిపోయాడు. అయితే ఎట్టకేలకు అతడు పెళ్లి పీటలు ఎక్కుతున్నాడని కథనాలు వెలువడుతున్నాయి. రెండు రోజులుగా శర్వానంద్ పెళ్లి వార్త టాలీవుడ్ హాట్ టాపిక్ గా ఉంది. ఈ వార్తలపై శర్వానంద్ స్పందించలేదు. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ శర్వానంద్ పెళ్లికి సిద్దమయ్యారని సంబంధం కుదిరింది అంటున్నారు.

శర్వానంద్ కి కాబోయే అమ్మాయి ఎవరనే సమాచారం కొన్ని మీడియా వార్తలు సేకరించాయి. వారి కథనాల ప్రకారం వృతిరీత్యా ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేశారు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే… ఆమె మాజీ మంత్రి గారి మనవరాలట. పొలిటికల్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన ఆ అమ్మాయి తాతగారు గతంలో మంత్రిగా చేశారట. ఇక ఆమెతో శర్వానంద్ నిశ్చితార్థం త్వరలో జరగనుందట. సమ్మర్ లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట.