NTR Krishna Secrets : సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ కున్న ఇమేజ్ ఏంటో అందరికి తెలిసిందే. తన పాత్రలతో అందరిని మెప్పించి సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా పేరుతెచ్చుకున్న చరిత్ర పురుషుడు. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. సూపర్ స్టార్ కృష్ణ కూడా నటనలో తనదైన ముద్ర వేస్తూ విభిన్నమైన చిత్రాల్లో నటించి మెప్పించిన వీరుడిగా గుర్తింపు పొందారు. అయితే వీరిద్దరికి కూడా అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలిసిందే.
Also Read: మెగాస్టార్ “ఆచార్య” సినిమా నుంచి మరో అప్డేట్… ఫుల్ ఖుషీలో అభిమానులు
ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ, కృష్ణ కురుక్షేత్రం రెండు సినిమాలు దాదాపు ఒకే కథాంశంతో సినిమాలు తీశారు. కానీ ఆర్టిస్టులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక కైకాల సత్యనారాయణ మాత్రం రెండు సినిమాల్లో నటించి మెప్పించారు. అల్లూరి సీతారామరాజు సినిమాను కూడా ఎన్టీఆర్ తీస్తామని అనుకునే సమయంలో కృష్ణ తీసి ఎన్టీఆర్ కు కోపం తెప్పించారట. ఇక అప్పటి నుంచి పదేళ్ల పాటు ఇద్దరి మధ్య మాటలు లేవు. అంటే ఎన్టీఆర్ ఎంత అభిమానం ఉన్న నటుడో తెలిసిందే.
అయితే దానవీర శూర కర్ణ ఘన విజయం సాధించగా కురుక్షేత్రం మాత్రం అపజయం పాలైంది. కానీ ఎన్టీఆర్ సినిమాకు మాత్రం పోటీ ఇచ్చిందని తెలుస్తోంది. రెండు సినిమాల్లో ఆర్టిస్టులు రెండుగా విడిపోయినా సత్యనారాయణ మాత్రం రెండు సినిమాల్లో నటించారు. దీనిపై ఎన్టీఆర్ సత్యనారాయణను పిలిచి తమ సినిమాలో నటించాలని కోరగా కురుక్షేత్రంలో నటించొద్దని చెప్పారట. కానీ అప్పటికే కురుక్షేత్రంలో మొదట బుక్ చేసుకున్నారని చెప్పడంతో ఇక తప్పక రెండు సినిమాల్లో నటించారు.
ఎన్టీఆర్ తన నటనతో అందరిని మెప్పించారు. దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సొంత నిర్మాణ సంస్థలో స్వీయ దర్శకత్వంలో నటించిన ఎన్టీఆర్ భవిష్యత్ తరాలకు మంచి సందేశం ఇచ్చారు. పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయి నటించే ఎన్టీఆర్ నటనా కౌశలానికి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.
Also Read: ప్రకాష్ రాజ్ తనకంటే ఎక్కువ వయసున్న హీరోలకు తండ్రిగా చేశాడు.. వారెవరో తెలుసా?
Recommended Videos: