Difference Between Gold Karats: భారతీయులకు బంగారమంటే ప్రాణం. మన దేశంలోని మహిళలు మొగుడికంటే బంగారానికి ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే వారికి బంగారంపై అమితమైన ప్రేమ ఉంటుంది. బంగారం స్వచ్ఛత గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంగారం ఆభరణాల తయారులో కీలక పాత్ర వహిస్తుంది. బంగారం ఎంత ఉంటే అంత విలువ ఉంటుంది. అందుకే మహిళలు ఎక్కువగా బంగారం ధరించేందుకు ప్రాముఖ్యత ఇస్తారు. మొగుడిని సాధించైనా బంగారం కొనుగోలు చేసి ఆభరణాలు తయారు చేయించుకుంటారు.

దీంతో విందులు, వినోదాల సమయంలో ఒళ్లంతా బంగారం వేసుకుని లక్ష్మిదేవిలా మెరుస్తారు. వారి బంగారు ఆభరణాలు చూసి అందరు ఆహా అని నోరెళ్లబెడతారు.బంగారంలో స్వచ్ఛతను బట్టి నాణ్యత ఉన్న విషయం అందరికి తెలియదు. బంగారంలో 24,22,18,14,10,9 క్యారెట్లు ఉంటాయి. వాటిని క్యారెట్లలో కొలుస్తారు. ఇలాంటి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువగా ముందుకు రావడం తెలిసిందే. క్యారెట్ల విషయంలో అందరికి వాటి గురించి తెలియదు. కానీ అందులోనే స్వచ్ఛత దాగి ఉంటుందనే విషయం తెలుసుకోవాలి.
Also Read: Pink Daimond: ఇప్పటిదాకా దొరికిన విలువైన వజ్రాలు ఏమిటో తెలుసా!
క్యారెట్ల తూకంలో బంగారం నాణ్యత కనిపిస్తుంది. దీంతో బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఇవి తెలుసుకుంటే మనకు సులభంగా ఉంటుంది.24 క్యారెట్ల బంగారమంటే 99.9 స్వచ్ఛమైనది. ఇందులో ఏది కలవదు. దీంతో 24 క్యారెట్ల బంగారమంటే అత్యంత ఖరీదైనది. దీన్ని ఆభరణాలు చేయించుకోలేలేం. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది.

అందుకే 24 క్యారెట్ల బంగారంతో సమానమని మాటల్లో చెప్పడం తెలిసిందే. అంతటి విలువైన బంగారమే ఈ 24 క్యారెట్ల బంగారం. ఇక 22 క్యారెట్ల బంగారం కాస్త లోహాలతో కలుస్తుంది. ఇందులో రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి మెటల్స్ కలిసి ఉంటాయి. ఇది 91.6 శాతం స్వచ్ఛమైన బంగారంగా చెప్పుకోవచ్చు. ఆభరణాల తయారీకి ఇది అనుకూలం.18 క్యారట్ల బంగారంలో 18 భాగాలు పసిడి ఉంటే ఆరు భాగాలు ఇతర లోహాలతో ఉంటుంది.
18 క్యారట్ల బంగారంలో పసిడి 75 శాతం, మిగతా 25 శాతం జింక్, రాగి, నికెల్ వంటి లోహాలు కలుస్తాయి. దీంతో ఇది ధృడంగా ఉంటుంది. ఆభరణాల తయారీకి అనువుగా ఉంటుంది. 14 క్యారెట్ల బంగారంలో 58 శాతం గోల్డ్, 42 శాతం ఇతర లోహాలు కలుస్తాయి. ప్రస్తుతం పది క్యారెట్లు, తొమ్మిది క్యారెట్ల బంగారం కూడా దొరుకుతోంది. కానీ వాటిని సులభంగానే గుర్తు పట్టొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం కాస్త డల్ గా కనిపిస్తుంది.