Pink Daimond: మానవుడి రూపాంతరం చీకటి ఖండం ఆఫ్రికాలోనే చోటుచేసుకున్నదన్నది చరిత్ర. ఇదే ఆఫ్రికా ఖండం ఎన్నో జీవ జాతులకు, విలువైన ఖనిజాలకు పేరొందింది. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక జంతుజాలం ఆఫ్రికా అడవుల్లోనే ఉన్నాయి. ఇక వజ్రాలకు ఈ ఖండం నెలవు. అటువంటి ఆఫ్రికాలోనే అంత్యంత అరుదైన పెద్ద గులాబీ వజ్రం దొరికింది. అంగాల దేశంలో వజ్రాల కోసం తవ్వుతున్న ఆస్ట్రేలియన్ ‘లుసాకా డైమండ్ కంపెనీకి’కి ఈ అత్యంత అరుదైన డైమండ్ దొరికింది.

మానవులు ధరించే ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖనిజాలు బంగారం, వజ్రాలు. వీటికి కోట్లు పలుకుతాయి. ముఖ్యంగా మేలురకం వజ్రాలు వేల కోట్ల విలువను చేస్తాయి. తాజాగా ఆఫ్రికా ఖండంలోని అంగోలా దేశంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన పెద్ద గులాబీ రంగు వజ్రం లభ్యమైంది. ఇప్పటిదాకా దొరికిన విలువైన వజ్రాల్లో ఇదే అంత్యంత ఖరీదైనదిగా తేలింది. 170 క్యారెట్లు ఉన్న ఈ గులాబీ రంగు వజ్రం రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్లు దాకా విలువ చేస్తుంది..
ఈ వజ్రం అచ్చమైన లేత గులాబీ రంగులో మిలమిలా మెరిసిపోతూ కనిపించింది. ఈ వజ్రం ఏకంగా ప్రపంచంలోనే అత్యంత నాణ్యతతో 170 క్యారెట్ల బరువు ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత 300 ఏళ్లలో గుర్తించిన అతిపెద్ద పింక్ డైమండ్ ఇదేనట.. అంగోలా దేశంలో వజ్రాలు అధికంగా ఉండే ఈశాన్య లులో గనిలో ఈ వజ్రం దొరికింది.
సాధారణంగా సహజమైన వజ్రాల్లో అత్యంత స్వచ్ఛతతో ఒకే రంగులో ఉండేవి అత్యంత అరుదు. ఈ పింక్ డైమండ్ అందుకే అత్యంత అరుదైనదిగా తేలింది. ప్రస్తుతం ముడి రూపంలో ఉన్న ఈ వజ్రాన్ని సానబెడితే 85-90 క్యారెట్ల వరకూ ఒక పెద్ద పాలిష్డ్ వజ్రంగా మారుతుంది. ఈ ప్రక్రియలో మరిన్ని వజ్రాలు రూపొందుతాయి.
ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాన్ని త్వరలోనే వేలం వేస్తామని సంస్థ తెలిపింది. ఇదే అత్యధిక ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. వేలంలో వెయ్యి కోట్లు దాటవచ్చని అంటున్నారు.
హాంకాంగ్ లో 2017లో వేసిన వేలంలో 59.6 క్యారట్ల బరువైన ‘పింక్ స్టార్’ అనే వజ్రం రూ.570 కోట్ల ధర పలికింది. ఇప్పటిదాకా ఇదే ప్రపంచంలో అత్యధికం. కానీ ఇప్పుడు దొరికిన లేత గులాబీ దీన్ని బ్రేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఈ గులాబీ రంగు వజ్రం రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్లు దాకా పలుకుతుందని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 2013లో వెలుగుచూసిన 14.82 క్యారెట్ల నారింజ వజ్రం అరుదైనదిగా ఇప్పటిదాకా ఉంది. ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా 2010లో ‘గ్రాఫ్ పింక్’ను పేర్కొన్నారు. 27.78 క్యారెట్ల ఇది 300 కోట్లు పలికింది. 2015లో బయటపడిన ‘బ్లూ మూన్’ కూడా అత్యంత అరుదైనదిగా గుర్తించారు. ఇది 315 కోట్లకు అమ్ముడు పోయింది.
ఇక 2017లో ‘పింక్ స్టార్’ అనే 59.6 క్యారెట్ల వజ్రం ప్రపంచంలోనే అరుదైన వజ్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది ఏకంగా 2462 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. ఇక ఆ తర్వాత ‘ఓపెన్ హైమర్ బ్లూ’ అనే వజ్రం 329 కోట్లు పలికి అరుదైన వజ్రాల జాబితాలో చోటుచేసుకుంది.
[…] […]