Pawan Kalyan- Sujeeth Movie: పవన్ కళ్యాణ్ ప్రస్తుత సినిమాల లైనప్ చాలా క్రేజీ గా ఉంది.. ఇదివరకు ఆయన కెరీర్ లో ఎన్నడూ కూడా ఇలాంటి లైనప్ ని సెట్ చేసుకోలేదు.. మొట్టమొదటిసారిగా కెరీర్ లో ‘హరి హర వీరమల్లు’ సినిమా ద్వారా పీరియాడిక్ జానర్ తో మన ముందుకి రాబోతున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ తో ఒక సినిమా , సుజిత్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు..ఈ లైనప్ లో పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్ పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.

ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి ఈ ప్రాజెక్ట్ వెళ్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.. ఎందుకంటే ఈ చిత్రానికి దర్శకుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అవ్వడమే.. వీరాభిమాని ఆకలితో సినిమా తీస్తే ఎలా ఉంటుందో పదేళ్ల క్రితం గబ్బర్ సింగ్ అనే సినిమా ద్వారా చూసాము..ఇప్పుడు ఇది సుజిత్ వంతు..సుజిత్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్..పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామనే ఇండస్ట్రీ కి వచ్చాడు..ఫైనల్ గా తన కోరికని నెరవేర్చుకోబోతున్నాడు.
గతంలో ఆయన ‘రన్ రాజా రన్’ , ‘సాహో’ వంటి సినిమాలు చేసాడు.. రన్ రాజా రన్ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది.. ఈ చిత్రంలో మనం సుజిత్ ప్రతిభ ని సంపూర్ణంగా చూడవచ్చు.. ఇక ఆ సినిమా తర్వాత ఏకంగా ప్రభాస్ తో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ తీయాల్సి వచ్చింది..బాహుబలి సిరీస్ వంటి సంచలనాత్మక చిత్రాల తర్వాత వచ్చిన సినిమా కావడం తో అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి.. అందుకే కమర్షియల్ గా ఆ చిత్రం యావరేజి గా నిలిచింది కానీ సుజిత్ టేకింగ్ కి మంచి మార్కులు పడ్డాయి.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ తీయబోతున్నాడు.. ఒక రిటైర్డ్ కరాటీ ట్రైనర్ తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కబోతోంది.. గతంలో పవన్ కళ్యాణ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో పంజా అనే మూవీ చేసాడు.. అది పెద్ద ఫ్లాప్ అయ్యింది.. మరి ఈసారి అదే బ్యాక్ డ్రాప్ తో సుజిత్ ఎలా చేస్తాడో చూడాలి.. ఈ సబ్జెక్టుని సరిగ్గా డీల్ చేస్తే పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది.. మరి సుజిత్ తన అభిమాన హీరో కి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేు సినిమా ఇస్తాడా లేదా అనేది చూడాలి.