Jabardasth Ram Prasad: జబర్దస్త్ స్టార్ కమెడియన్స్ లో రామ్ ప్రసాద్ ఒకరు. సుడిగాలి సుధీర్ టీం మెంబర్ గా ఆయన మంచి పాపులారిటీ రాబట్టారు. సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి రామ్ ప్రసాద్ పంచే కామెడీ అద్భుతంగా ఉంటుంది. ఆటో పంచ్ డైలాగ్స్ కి రామ్ ప్రసాద్ బాగా ఫేమస్. అందుకే ఆయన్ని ఆటో రామ్ ప్రసాద్ అంటారు. జబర్దస్త్ లో సంచలనాలు చేసిన సుడిగాలి సుధీర్ టీం కి స్కిట్స్ రాసేది రామ్ ప్రసాదే. జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీ ఆయన్ని నటుడిని చేసింది. సినిమాల్లో కమెడియన్ గా కూడా రామ్ ప్రసాద్ చేస్తున్నారు.

అయితే రామ్ ప్రసాద్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఆయన తల కవర్ చేసుకొని కనిపించారు. రామ్ ప్రసాద్ లుక్ చూస్తే ఆయన ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే తలకు మాస్క్ పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన గాలోడు మూవీ విడుదలైంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు జబర్దస్త్ మిత్రులు అందరూ వచ్చారు. అయితే రామ్ ప్రసాద్ రాలేదు. ఫోన్లోనే బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో రామ్ ప్రసాద్ కి ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రామ్ ప్రసాద్ కి ఏమీ కాలేదు. ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. అందుకే తలకు మాస్క్ తో కనిపిస్తున్నారు. అంతకు మించి వేరే కారణాలు లేవు. రామ్ ప్రసాద్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ విశ్వసనీయ సమాచారం అందుతుంది. విషయం తెలిశాక ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం టాప్. వారి స్కిట్స్ మంచి కామెడీ పంచుతాయి. ఏళ్ల తరబడి ముగ్గురు మిత్రులు నాన్ స్టాప్ కామెడీ పంచారు. అయితే సుడిగాలి సుధీర్ టీమ్ విచ్ఛిన్నం అయ్యింది. కొన్నాళ్ళు కేవలం రామ్ ప్రసాద్ మాత్రమే స్కిట్స్ నడిపించారు. సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడంతో కొత్త కమెడియన్స్ ని తీసుకొని రామ్ ప్రసాద్ స్కిట్స్ చేశారు. గత స్కిట్స్ కి రామ్ ప్రసాద్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. కాగా గెటప్ శ్రీను తిరిగి వచ్చాడు. రామ్ ప్రసాద్ తో పాటు స్కిట్స్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ మాత్రం ఇంకా రాలేదు. ఆయన త్వరలో వస్తున్నానని ప్రకటించారు కానీ, అది జరగలేదు.