
Veera Brahman Garu: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి క్రీ.శ. 1608లో భవిష్యత్ గురించి కాలజ్ణానం రాశారు. రాబోయే కాలాన్ని ముందే గ్రహించి ఆయన రాసిన చాలా విషయాలు ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. ఆయన సూచించిన ఎన్నో విషయాలు మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. బ్రహ్మంగారు గొప్ప తత్వవేత్త. కాలజ్ణాని. అందుకే ఆయన భవిష్యత్ గురించి అంత వివరంగా పేర్కొన్నారు. పరబ్రహ్మాన్ని చేరుకునేందుకు ధ్యానం ఒకటే మోక్షమార్గమని చెప్పాడు. కాబోయే కాలంలో జరగబోయే విషయాలను చెప్పడం గమనార్హం.
Also Read: Pakistan: తారాస్థాయికి ఆర్థిక సంక్షోభం: పాక్ లో 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?

బ్రహ్మంగారు అచ్చమ్మ ఇంటిలో గోవులు కాయడానికి ఒప్పుకుంటాడు. ప్రతి రోజు గోవులను అడవికి తీసుకుపోయి ఒక చోట వాటిని ఉంచి గుట్ట దొనలో కాలజ్ణానం గురించి వివరాలు రాయడం మొదలు పెడతాడు. బ్రహ్మంగారు కాలజ్ణానాన్ని ఒక రోజులో రాయలేదు. రకరకాల సందర్భాల్లో రాస్తూ పోయారు. ఆయన రాసిన చాలా విషయాలు మనకు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. బ్రహ్మంగారు రాసిన కాలజ్ణానాన్ని ఒక చోట పాతిపెట్టారు. అలా ఎందుకు చేశారనేది ఇప్పటికి కూడా తెలియలేదు.
ప్రస్తుతం ఆయన చెప్పిన ఎన్నో విషయాలు మనకు తెలిశాయి. కాశీలోని దేవాలయం నలబై రోజులు మూత పడుతుందని చెప్పారు. 1910 నుంచి 12 మధ్యలో గంగానదికి వరదలు రావడంతో అక్కడ కలరా వ్యాపించి దేవాలయ దర్శనానికి ఎవరు రాలేదు. రాచరికాలు పోయి ప్రజాస్వామ్య పాలన వస్తుందని చెప్పారు. దేశాన్ని ఒక మహిళ 16 ఏళ్లు పాలిస్తుందని వివరించారు. ఇందిరాగాంధీ ఆ పని చేసింది. పొట్టివాడు గట్టివాడైన వాడు రాజ్యమేలుతాడని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి అదే కోవకు చెందుతారు. పగటి వేషగాళ్లు రాజ్యమేలుతారన్నాడు. ఎన్టీఆర్, జయలలిత వంటి వారు ఆ పని చేశారు.
అత్తలకు పీటలు కోడళ్లకు మంచాలు అన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. దేశాన్ని విదేశీయులు పాలిస్తారు అన్నాడు. మన దేశాన్ని ఆంగ్లేయులు దాదాపు 200 ఏళ్లు బానిసలుగా చేసుకుని పాలించారు. కృష్ణానది బెజవాడ కనకదుర్గ ముక్కుకు తాకుతుందని చెప్పారు. అది కూడా త్వరలో జరుగుతుందేమో తెలియదు. ఇలా వీర బ్రహ్మంగారు చెప్పిన అంశాలు చూస్తుంటే మనకు మతిపోతుంది. ఆకాలంలోనే ఆయన భవిష్యత్ ను ఊహించి కాలజ్ణానం రాయడం అందరికి ఆశ్చర్యకరమే.
Also Read: Mahesh-Trivikram Movie US Rights: బ్రేకింగ్… భారీ ధరకు మహేష్-త్రివిక్రమ్ మూవీ యూఎస్ రైట్స్..!