Manchu Manoj: మంచు మనోజ్ పెళ్ళయ్యాక మొదటిసారి అత్తారింటికి వెళ్లారు. భార్య మౌనికతో పాటు హైదరాబాద్ నుండి భారీ కాన్వాయ్ తో బయలుదేరి వెళ్లారు. అత్తారింటికి వెళ్ళాక ఆయన చేసిన మొదటి పని అత్తమామలకు నివాళులు అర్పించడం. మనోజ్-మౌనిక వారి సమాధుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆళ్లగడ్డలో ఉన్న భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి సమాధులను నూతన దంపతులు సందర్శించారు. రాయలసీమ రాజకీయాల్లో చక్రం తిప్పిన భూమా నాగిరెడ్డి దంపతులు మూడేళ్ళ వ్యవధిలో కన్నుమూశారు.
శోభా నాగిరెడ్డి 2014లో కారు ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టడంతో తీవ్ర గాయాలపాలై కన్నుమూశారు. భార్య మరణం భూమా నాగిరెడ్డిని తీవ్ర వేదనకు గురి చేసింది. ఇక 2017లో భూమా నాగిరెడ్డి గుండెపోటుకు గురై కన్నుమూశారు. తల్లిదండ్రుల రాజకీయ వారసత్వాన్ని కూతురు అఖిల ప్రియ కొనసాగిస్తున్నారు. ఆమె ప్రస్తుతం టీడీపీ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మంత్రిగా చేశారు.
అఖిల ప్రియ చెల్లెలు మౌనిక రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. అయితే తమ కుటుంబానికి మద్దతుగా మాట్లాడతారు. ఆరోపణలు ఖండిస్తుంటారు. ఓ పెద్ద పొలిటికల్ ఫ్యామిలీకి అల్లుడిగా మనోజ్ వెళ్ళాడు. ఇక భూమా మౌనికకు కూడా ఇది రెండో వివాహం. 2016లో గణేష్ రెడ్డి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని విడిపోయారు. వీరికి ధైరవ్ రెడ్డి అనే కొడుకు ఉన్నారు. మనోజ్ వివాహం అనంతరం ధైరవ్ బాధ్యత కూడా నాదే అంటూ ప్రకటించారు.
మార్చి 3న హైదరాబాద్ లోని మంచు లక్ష్మి నివాసంలో మంచు మనోజ్-మౌనికల వివాహం జరిగింది. ఈ వివాహం మోహన్ బాబుకు ఇష్టం లేదన్న ప్రచారం జరిగింది. అయితే పెళ్లికి కొన్ని నిమిషాల ముందు మోహన్ బాబు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంచు విష్ణు మాత్రం డిస్టెన్స్ మైంటైన్ చేశారు. అన్యమనస్కంగా వివాహానికి వచ్చిన మంచు విష్ణు… కాసేపు ఉండి వెళ్లిపోయారట. ఆయన మంచు మనోజ్ పెళ్లి ఫొటోల్లో కూడా కనిపించలేదు.
ఇక మంచు మనోజ్ త్వరలో సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు ఆరేళ్ళు పరిశ్రమకు దూరమైన ఆయన ‘వాట్ ది ఫిష్’ టైటిల్ తో కొత్త చిత్రం ప్రకటించారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి కలిగించింది. మరి మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా సక్సెస్ అవుతారేమో చూడాలి.
Pellikoduku♥️@HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/NDAzG7O3Ab
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 3, 2023