
Wife: అర్థం చేసుకోలేని అర్థాంగి ఉంటే కోట్లున్నా నరకమే. అదే మనల్ని అర్థం చేసుకునే భార్య ఉంటే పేదరికమైనా స్వర్గమే. అది వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కొందరైతే భర్త చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటారు. వీరు ఉత్తములు. ఇంకా కొందరు తమరు చెప్పిందే భర్త వినాలి. లేదంటే గొడవే. వీరు అధములు. వీరితో వేగలేకపోతాం. వారు చేసే అల్లరికి మనం చిల్లరగా మారతాం. ఇది నిత్యం ఉంటే ఇక మనకు నరకమే గతి. అందుకే జీవితభాగస్వామిని ఎంచుకునే సమయంలోనే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని చెబుతుంటారు.
ఎవరు మంచివారు?
మన జీవితంలో ఎదిగే క్రమంలో మన ఉన్నత మార్గానికి బాటలు వేసుకునే సమయంలో మనకు తోడుగా ఉండేవారు మంచివారు. వారి సలహాలు, స సూచనలు పాటిస్తే మనకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. జీవితంలో ఎదిగేందుకు మార్గం దొరుకుతుంది. అంతేకాని మనం వెళ్తున్న దారిలో ముళ్లు వేసేవారు కూడా ఉంటారు. అలాంటి వారితో మనం వేగలేం. మనం ఎడ్డెం వారు తెడ్డెం అంటే పనులు ముందుకు సాగవు. దీంతో మన పతనం మనమే కొనితెచ్చుకున్న వాళ్లమవుతాం.

జీవిత భాగస్వామి అంటే?
జీవిత భాగస్వామి అంటే మనం అభివృద్ధి సాధించేందుకు చేయూత నిచ్చేవారై ఉండాలి. అంతేకాని మన చేయి పట్టుకుని తోసేసే వారుంటే కష్టమే. బండి ముందుకు నడవాలంటే రెండు ఎద్దులు సమన్వయంతో ఉంటేనే వీలవుతుంది. అలాగే సంసారం కూడా సజావుగా సాగాలంటే భార్యాభర్తలు సమన్వయంతో ఉంటేనే సాధ్యం అవుతుంది. లేదంటే ఆ బండి కదలదు. ఆ సంసారం ముందుకు పోదు. ఇలా భాగస్వామి అంటే మన భాగంలో ఉండాలి కానీ మనల్ని అడుగుకు తొక్కే విధంగా ఉండకూడదు.
ఇంట గెలిచి..
ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మన ఇంట్లోనే పెళ్లాం మన మాట వినలేదంటే ఇక బయట నీ మాట ఎవరు వింటారు అని దీని అర్థం. అందుకే అర్థాంగి అంటే మన మసును అర్థం చేసుకునేది అయి ఉండాలి. అంతేకాని ఆమెను మనం అర్థం చేసుకోవాలంటే కష్టమే. ఇలాంటి వారితోనే నేడు సంసారంలో గొడవలు వస్తున్నాయి. అవి విడాకులు వరకు వెళ్తున్నాయి. కట్టుకున్న భార్య మన కనుసన్నల్లో ఉండకపోతే ఆ జీవితం నరకప్రాయమే. అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి.