Homeట్రెండింగ్ న్యూస్Kohli Daughter: కూతురు బర్త్ డేలో కోహ్లీ ఏం చేశాడంటే?

Kohli Daughter: కూతురు బర్త్ డేలో కోహ్లీ ఏం చేశాడంటే?

Kohli Daughter: టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్లో బీజీగా ఉన్నారు. సౌతాఫ్రికాతో టీం ఇండియా మూడు టెస్టు మ్యాచులను ఆడుతోంది. ఈ మ్యాచులకు సారథ్యం వహిస్తున్న కోహ్లీ టీం ఇండియాకు విజయాలను అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. ఇక ఈ టూర్ కు కోహ్లీ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. దీంతో కోహ్లీ భార్య అనుష్మ శర్మ ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచులను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో అక్కడి పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన అప్డేట్స్ తన ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతోంది.

bollywood actress anushka thanks to media bout her daughter

సౌతాఫ్రికా పర్యటనలోనే విరుష్క జంట తమ కూతురు బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. జనవరి 11న కోహ్లీ గారాలపట్టి వామిక తొలి బర్త్ డే జరుపుకుంది. ఈ బర్త్ డే వేడుకలకు పలువురు సెలబ్రెటీలు హాజరై వామికను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ను అనుష్క శర్మ తాజాగా తన ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. తమ కూతురు బర్త్ డే సందర్భంగా విరుష్క జంట వైన్ పార్టీ చేసుకోవడం హైలెట్ నిలిచింది.

విరుష్క జంట వైన్ గ్లాస్ తో చీర్స్ చెప్పుకుంటున్న ఫొటోను అనుష్క శర్మ షేర్ చేసి ఇలా రాసుకొచ్చింది. ‘‘సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు.. లేలేత అందగాడిలా మెరిసిపోతున్నాడు.. టేబుల్ నిండుగా ఉంది.. మా పాప కూడా అలా మారిపోయింది.. సాయంత్రం స్పెషల్ పార్టీ చాలా బాగా జరిగింది..’ అని పేర్కొంది.

వామికకు ఆశీస్సులు ఇచ్చేందుకు వచ్చిన అతిథులందరికీ విరుష్క జంట కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వామికను ఎత్తుకున్న ఫోటోకు అనుష్కశర్మ ‘‘నా పాప’’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఆకట్టుకుంది. అనుష్క తల్లిగా మారిన తర్వాత తన పాపతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. తన పాపతో గడుపడం కన్నా గొప్ప జీవితం లేదని గతంలోనే అనుష్క తన మనసులో బయటపెట్టింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular