Sri Krishnadevaraya: శ్రీ కృష్ణ దేవరాయలను తెలుగు వారు ఎప్పటికీ మర్చిపోలేరు. తెలుగు భాష గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటి చెప్పిన వ్యక్తి ఈ చక్రవర్తి. అలాంటి శ్రీ కృష్ణ దేవరాయలంటే మొగల్ చక్రవర్తి బాబర్ భయపడేవారట. మొగల్ చక్రవర్తి బాబర్ కి కూడా చాలా బలగం ఉండేది. అంతేకాదు అత్యంత బలమైన సైన్యం కూడా కలదు. అయినా శ్రీ కృష్ణ దేవరాయల విషయంలో మాత్రం భయపడేవారట. ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఓ లుక్ వేయండి.
శ్రీ కృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సంగతి తెలిసిందే. రాయల వారి హయంలో విజయనగర సామ్రాజ్యం ఎక్కువగా అభివృద్ది చెందింది. నేటికీ ప్రజలు రాయల వారి కాలాన్ని తలుచుకుంటూనే ఉంటారు. అప్పట్లో వస్తువులు కొనుగోలు విధానం ఉండేది కాదు. కేవలం వస్తు మార్పిడి విధానం మాత్రమే పాటించేవారు. అందుకే ఆ కాలంలో రాజ్యం సుభిక్షంగా ఉండేది అంటారు. అయితే ఆ రోజుల్లో ఈయన సైన్యం యాభై వేల మంది వీర సైనికులతో నిండి ఉండేదట.
పోర్చుగీసు సైనికులు అయితే ఫిరంగులు కూడా కాల్చేవారు. 600 గజ దళం, 3200 అశ్వదళం ఉండేవట. దక్షిణ ఆసియా మొత్తంలో రాయల వారి సైన్యం అత్యంత బలమైనదిగా పేరు పొందింది. అప్పట్లో అధిక సైన్య బలం ఉన్న బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా ను కూడా రాయలు ఓడించగలిగారు. ఆదిల్ షాకు ఉన్న బలగం తక్కువేమి కాదు. ఆ రోజుల్లోనే 900కు పైగా ఫిరంగుల సామర్థ్యాన్ని బీజాపూర్ సుల్తాన్ సైన్యం కలిగి ఉంది. అంతటి భారీ సైన్యాన్ని సైతం రాయలు ఓడించగలిగారు.
బాబర్ కు మాత్రం యాభై వేల సైనిక బలంతో పాటు మరో యాభై ఫిరంగుల సామర్థ్యం ఉందట. ఒకవేళ బాబరు రాయలుతో పోటీ పడినప్పటికీ, బాబరు కచ్చితంగా ఓటమి పాలయ్యేవాడు. అందుకే బాబరు రాయలు జోలికి పోలేదని చెబుతుంటారు. డెక్కన్ సామ్రాజ్యాన్ని రాయల వారి వంశస్థులు 250 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించారని తెలుస్తోంది. ఇవన్నీ ఒకెత్తు అయితే రాయల వారికి ఉన్న ధైర్య సాహసాలు మరో రాజుకు లేవట. అందుకే రాయలు మకుటం లేని మహారాజుగా పాలను చేశారు. ఇలా ఈయన గురించి తెలిసి మొగల్ చక్రవర్తి మాత్రం భయపడేవారట.