Dubai: భారతీయులు అమెరికా తర్వాత ఎక్కవగా పర్యటించే దేశం దుబాయ్. టూరిస్టులుగానే కాకుండా ఉపాధి కోసం కూడా చాలా మంది దుబాయ్ వెళ్తున్నారు. భారత్ నుంచి దుబాయ్‌కి, దుబాయ్ నుంచి భారత్‌కు నిత్యం రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులను మరింత ఆకర్షించేందుకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది దుబాయ్ ప్రభుత్వం. తమ దేశానికి రావాలనుకునే ఇండియన్స్‌కు వీసా నిబంధనలను మరింత సులభతరం చేసింది.
మల్టీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
భారతీయుల కోసం ఐదేళ్ల మల్లీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాను దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిని బిజినెస్, ట్రాన్సిట్, టూరిస్ట్, వర్క్ విసాలుగా విభజించింది. తద్వారా భారత్ నుంచి పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని భావిస్తోంది. ఈ వీసాను దరఖాస్తు చేసుకన్న మూడు నుంచి ఐదు రోజుల్లోనే జారీ చేస్తుంది. ఈ వీసాతో ఒకేసారి 90 రోజులు అదేశంలో ఉండడానికి అనుమతి లభిస్తుంది. గరిష్టంగా 180 రోజులు ఉండేలా ఐదేళ్లపాటు దుబాయ్‌లో పర్యటించవచ్చు.
సత్సంబంధాల కోసంమే..
దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది ఎకానమీ అండ్ టూరిజం(డీఈటీ) తెలిపిన నివేదిక ప్రకారం 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు 2.46 మిలియన్ల భారతీయులు దుబాయ్‌ని సందర్శించారు. కొత్తగా తీసుకువచ్చిన మల్టీపుల్ వీసాతో పర్యాటకుల మరింత ఎక్కవగా దుబాయ్ సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. విహార యాత్రలు పెరుగుతాయి. దీంతో దుబాయ్, భారత్ మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి.
భారత్‌తో బంధం కోసం..
భారత్‌తో దీర్ఘకాల బంధాలను మెరుగుపర్చుకోడానికే దుబాయ్ ఇలా చేస్తోంది. డీ33 అజెండా లక్ష్యాలకు అనుగుణంగా వ్యాపారం, పెట్టుబడులు, పర్యాటకంగా దుబాయ్ స్థానాన్ని మెరుగుపచ్చేందుకు ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం అభిప్రాయపడింది. విలాసవంతమైన షాపింగ్, సాంస్కృతిక అనుభవాలు, కుటుంబ స్నేహపూర్వక ఆకర్షణలు, వ్యాపార సమావేశాలు తదితర అంశాల పరంగా పర్యాటకులను ఆకర్షించాలని ఈ నిర్ణయం తీసుకుంది.