https://oktelugu.com/

Waltair Veerayya Theatrical Trailer :15 నిమిషాల్లో 10 లక్షల వ్యూస్.. చరిత్ర సృష్టించిన ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్

Waltair Veerayya Theatrical Trailer : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల చేసారు..ఈ ట్రైలర్ కి కేవలం అభిమానుల నుండి మాత్రమే కాదు, ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని చూసిన అనుభూతి కలిగిందంటూ ప్రతీ ఒక్కరు సంబరపడిపోయారు..మెగాస్టార్ మార్క్ కామెడీ..డ్యాన్స్ మరియు ఫైట్స్ చూస్తుంటే ఈ సంక్రాంతి కి మెగాస్టార్ కొట్టే కొట్టుడికి బాక్స్ ఆఫీస్ షేప్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 7, 2023 / 08:44 PM IST
    Follow us on

    Waltair Veerayya Theatrical Trailer : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల చేసారు..ఈ ట్రైలర్ కి కేవలం అభిమానుల నుండి మాత్రమే కాదు, ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని చూసిన అనుభూతి కలిగిందంటూ ప్రతీ ఒక్కరు సంబరపడిపోయారు..మెగాస్టార్ మార్క్ కామెడీ..డ్యాన్స్ మరియు ఫైట్స్ చూస్తుంటే ఈ సంక్రాంతి కి మెగాస్టార్ కొట్టే కొట్టుడికి బాక్స్ ఆఫీస్ షేప్ మారిపోవడం ఖాయం అనిపిస్తుంది.

    చిరంజీవి గత రెండు చిత్రాలైన ‘ఆచార్య’ మరియు ‘గాడ్ ఫాదర్’ కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు..మెగా అభిమానులు సరైన సినిమా కోసం ఆకలితో ఎదురు చూస్తున్నారు..అలాంటి సమయం లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఒక విందు భోజనం లా అనిపించింది..డైరెక్టర్ బాబీ చిరంజీవిని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలని కోరుకున్నారో అదే విధంగా చూపించి శబాష్ అనిపించుకున్నాడు.

    ఇక ఈ ట్రైలర్ లో చిరంజీవి డైలాగ్ రవితేజ , రవితేజ డైలాగ్ చిరంజీవి చెప్పడం చూసే ప్రతీ ఒక్కరికి చాలా సరదాగా అనిపించింది..వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ కూడా ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే విధంగా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..మెగాస్టార్ మార్క్ స్పష్టంగా ఈ ట్రైలర్ లో కనపడడం తో యూట్యూబ్ రికార్డు స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది..ట్రైలర్ విడుదల చేసిన 15 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇక రెండు గంటల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 2.6 మిలియన్ల వ్యూస్ అందుకొని రికార్డ్ సృష్టించింది.

    ఈ రేంజ్ వ్యూస్ నేటి తరం స్టార్ హీరోలకు కూడా సాధ్యపడదు..మెగాస్టార్ ఒక్కసారి మాస్ లో దిగితే ఆయన ప్రభంజనం కి ఎవ్వరూ అడ్డుకట్ట వెయ్యలేరు అనేందుకు ఉదాహరణగా నిలిచే సినిమాగా ఈ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఉంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు..చూడాలిమరి అభిమానుల్లో ఉన్న అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందో అనేది.