https://oktelugu.com/

IND vs SL : చివరి టీ20లో లంక పై భారత్ గెలుపు: సిరీస్ హార్దిక్ సేన వశం

IND vs SL : భారత్ క్రికెట్ జట్టు ఈ ఏడాది తన క్రీడా ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించింది.. శ్రీలంకతో జరిగిన మూడు టి20 మ్యాచ్ ల సీరిస్ ను 2_1 తేడాతో గెలుచుకుంది..రాజ్ కోట్ లో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో శ్రీలంక జట్టుపై 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సూర్య కుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సీరిస్ ను అక్షర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2023 / 09:30 AM IST
    Follow us on

    IND vs SL : భారత్ క్రికెట్ జట్టు ఈ ఏడాది తన క్రీడా ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించింది.. శ్రీలంకతో జరిగిన మూడు టి20 మ్యాచ్ ల సీరిస్ ను 2_1 తేడాతో గెలుచుకుంది..రాజ్ కోట్ లో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో శ్రీలంక జట్టుపై 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సూర్య కుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సీరిస్ ను అక్షర్ పటేల్ సొంతం చేసుకున్నాడు.

    టాస్ గెలిచి…

    ముంబాయిలోని వాంఖడే మైదానంలో తొలి టి20 భారత్ నెగ్గింది. పుణె లో జరిగిన రెండో టీ 20లో శ్రీలంక గెలిచింది. ఇక మూడో టి20 గెలిచి ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలని రెండు జట్లు బరిలోకి దిగాయి.. అయితే టాస్ గెలిచి ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు..భారత జట్టు స్కోరు 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ క్యాచ్ అవుట్ గా వెను తిరిగాడు. ఈ క్రమంలో రాహుల్ త్రిపాఠి రెండో స్థానంలో వచ్చాడు. కుదురుకునేందుకు కొంచెం సమయం తీసుకున్నప్పటికీ రాహుల్, శుభ్ మన్ గిల్ జట్టు స్కోరును పరుగులు పె ట్టించారు.. ముఖ్యంగా రాహుల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు.. రెండు వరస సిక్సర్లు బాది మూడో బంతి కి క్యాచ్ ఔట్ అయ్యాడు. అప్పటికి త్రిపాఠీ స్కోరు 16 బంతుల్లో 34 పరుగులు.. అంటే అతడు ఏ స్థాయిలో అడాడో అర్థం చేసుకోవచ్చు. ఇక త్రిపాఠి అవుట్ అయిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు వచ్చాడు. వచ్చిన వెంటనే సుడిగాలి ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు..ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు.. మైదానం నలుమూలల షాట్లు కొడుతూ శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తించాడు.. ఈ క్రమంలోనే ఆఫ్ సెంచరీ, సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు గిల్ కూడా కుదురుకొని స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు.. వ్యక్తిగత స్కోరు 46 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఇక ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, హుడా వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అక్షర్ పటేల్ 9 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మొత్తానికి భారత్ ఇన్నింగ్స్ ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగుల వద్ద ముగిసింది.

    లంక బెంబేలు

    తిరిగి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక మొదట్లో ధాటిగానే ఆడింది. నిసాంక, మెండీస్ మొదటి వికెట్ కు 44 పరుగులు జోడించారు. అది కూడా నాలుగు ఓవర్లలోనే. అయితే వీరి జోడిని అక్షర్ పటేల్ విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ లలో శనక, డిసిల్వా తప్ప మిగతావారు రాణించకపోవడంతో శ్రీలంక 137 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా, చాహాల్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.

    మిడిల్ నిలబెట్టింది

    బ్యాటింగ్ కు స్వర్గ ధామమైన రాజ్కోట్ మైదానంలో భారత జట్టును మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నిలబెట్టారు.. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఓపెనర్ ను త్వరగానే కోల్పోయింది.. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ భారత ఇన్నింగ్స్ లో చక్కదిద్దారు.. ఏకంగా 200 పై చిలుకు స్కోరు సాధించేలా చేశారు.. ఈ గెలుపుతో భారత్ పూణేలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. కొత్త ఏడాదిలో తన ప్రయాణాన్ని సిరిస్ విజయంతో ప్రారంభించింది.