https://oktelugu.com/

Walthair Veeraiah Collections : అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూలు చేయబోతున్న ‘వాల్తేరు వీరయ్య’

Walthair Veeraiah Collections : ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో రివ్యూస్ , రేటింగ్స్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ కి మోతమోగించిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘వాల్తేరు వీరయ్య’ అనే చెప్పాలి.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాని మొదటి ఆట నుండే తొక్కేయాలని పచ్చ మీడియా శతవిధాలుగా ప్రయత్నం చేసింది.. కానీ మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా ముందు వాళ్ళ ఎత్తులు నిలబడలేకపోయాయి. అమెరికా నుండి అనకాపల్లి వరకు […]

Written By: , Updated On : January 16, 2023 / 10:13 PM IST
Follow us on

Walthair Veeraiah Collections : ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో రివ్యూస్ , రేటింగ్స్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ కి మోతమోగించిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘వాల్తేరు వీరయ్య’ అనే చెప్పాలి.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాని మొదటి ఆట నుండే తొక్కేయాలని పచ్చ మీడియా శతవిధాలుగా ప్రయత్నం చేసింది.. కానీ మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా ముందు వాళ్ళ ఎత్తులు నిలబడలేకపోయాయి.

అమెరికా నుండి అనకాపల్లి వరకు వాళ్లు ఇచ్చిన డిజాస్టర్ రేటింగ్స్ తోనే ‘వాల్తేరు వీరయ్య’ రికార్డ్స్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది.. ముఖ్యంగా రివ్యూస్ మరియు రేటింగ్స్ చూసి కానీ కదలని ఓవర్సీస్ లో వీరయ్య సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.. కేవలం మూడు రోజుల్లోనే 17 లక్షల డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.. మెగాస్టార్ మాస్ లోకి దిగితే ఒక్క రికార్డు కూడా మిగలదు అని ఫ్యాన్స్ చెప్పిన మాటల్ని నిజం చేసింది ఈ చిత్రం.

ఈరోజు లేదా రేపటి లోపు 2 మిలియన్ డాలర్స్ వసూలు చేయబోతున్న ఈ సినిమా అతి త్వరలోనే 3 మిలియన్ మార్కుని కూడా అందుకోబోతుందా అనే సందేహాలు ట్రేడ్ వర్గాల్లో నెలకొన్నాయి.. ఇప్పటి వరకు అమెరికాలో 3 మిలియన్ క్లబ్ లోకి చేరిన సినిమాలు బాహుబలి సిరీస్, #RRR, రంగస్థలం , భరత్ అనే నేను మరియు అలా వైకుంఠపురంలో.. ఇప్పుడు ఆ జాబితాలోకి ‘వాల్తేరు వీరయ్య’ కూడా చేరబోతుందా అంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అవుననే చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

ఎందుకంటే ఈ సినిమాకి సోమవారం రోజు కూడా లక్ష డాలర్స్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సోమవారం రోజు ఈ చిత్రానికి లక్ష 75 వేల డాలర్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.. ఇక మంగళవారం రోజు టికెట్స్ కి ఆఫర్లు ఉన్నాయి.. ఆరోజు కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.. ఈ రేంజ్ ట్రెండ్ ఉంది కాబట్టి 3 మిలియన్ మార్కుని అందుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు అంటున్నారు విశ్లేషకులు.. చూడాలిమరి.