Waltair Veerayya : నెట్ ఫ్లిక్స్ లో ‘వాల్తేరు వీరయ్య’ సరికొత్త రికార్డు.. #RRR రికార్డు ని కూడా బ్రేక్ చేస్తుందా?

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే.సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలిచింది.50 రోజులు కూడా పోస్ట్ కరోనా అత్యధిక సెంటర్స్ లో రన్ అయినా చిత్రం గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని […]

Written By: NARESH, Updated On : March 9, 2023 9:42 pm
Follow us on

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే.సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలిచింది.50 రోజులు కూడా పోస్ట్ కరోనా అత్యధిక సెంటర్స్ లో రన్ అయినా చిత్రం గా నిలిచింది.

అయితే ఈ చిత్రాన్ని 50 రోజులు పూర్తి కాకముందే నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 28 వ తారీఖున విడుదల చేసారు.ఇప్పటికి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చి పడి రోజులు పూర్తి కావొస్తుంది.ఈ గ్యాప్ లో అన్నీ భాషలకు సంబంధించిన కొత్త సినిమాలు విడుదల అయ్యాయి, కానీ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని మాత్రం ఒక్క సినిమా కూడా క్రిందకి దించలేకపోయ్యాయి.

విడుదలైన రోజు నుండి నేటి వరకు ఈ సినిమా మొదటి స్థానం లోనే ట్రెండ్ అవుతూ వస్తుంది.ఇలా రీసెంట్ టైం లో ఒక సినిమా ఇన్ని రోజులు నెంబర్ 1 స్థానం లో ట్రెండ్ అవ్వడం ఎప్పుడూ జరగలేదు.’వాల్తేరు వీరయ్య’ చిత్రం థియేటర్స్ లో అంత అద్భుతమైన రన్ ని దక్కించుకోవడానికి కారణం మాస్ మరియు యూత్ ఆడియన్స్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.సుమారుగా నెల రోజుల పాటు ఈ సినిమాకి అన్నీ ప్రాంతాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయంటే అందుకు కారణం వాళ్ళే.

ఓటీటీ లో కూడా ఇంత గొప్పగా ట్రెండ్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళే.అయితే ఈ సినిమా రాబొయ్యే రోజుల్లో #RRR రికార్డు ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.#RRR చిత్రం సుమారుగా 5 వారల పాటు నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1 స్థానం లో కొనసాగింది.’వాల్తేరు వీరయ్య’ రెండు వారాలు అయితే కచ్చితంగా టాప్ 1 స్థానంలోనే కొనసాగుతుంది, 5 వారాల పాటు ఇదే ఫామ్ ని కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి.