Walthair Veeraiah Collections : అక్షరాలా 50 కోట్ల రూపాయిల లాభాలు.. 50 రోజులు అయినా తగ్గని ‘వాల్తేరు వీరయ్య’ జోరు

Walthair Veeraiah Collections : మెగా హీరోలు కంబ్యాక్ ఇస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ ఏ రేంజ్ లో తిరగరాస్తారో గతం లో మనం ఎన్నో సినిమాలకు చూసాం, ఇప్పుడు లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి మరోసారి అది కళ్లారా చూస్తున్నాము.ఆచార్య సినిమాకి 80 కోట్ల రూపాయిలు నష్టం వచ్చింది, గాడ్ ఫాదర్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు.ఈ రెండు సినిమాల ఫలితాలను […]

Written By: NARESH, Updated On : March 2, 2023 10:07 pm
Follow us on

Walthair Veeraiah Collections : మెగా హీరోలు కంబ్యాక్ ఇస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ ఏ రేంజ్ లో తిరగరాస్తారో గతం లో మనం ఎన్నో సినిమాలకు చూసాం, ఇప్పుడు లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి మరోసారి అది కళ్లారా చూస్తున్నాము.ఆచార్య సినిమాకి 80 కోట్ల రూపాయిలు నష్టం వచ్చింది, గాడ్ ఫాదర్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు.ఈ రెండు సినిమాల ఫలితాలను చూసి అందరూ చిరంజీవి పని ఇక అయిపోయింది.

ఆయన రిటైర్ అయిపోవడం బెస్ట్ అంటూ మెగా అభిమానులు సైతం సలహాలు ఇవ్వడం ప్రారంభించారు.అలాంటి సలహాలు ఇచ్చి పాపం కనీసం మూడు నెలలు కూడా పూర్తి కాలేదు.ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో తన స్టార్ స్టేటస్ ని తక్కువ అంచనా వేసిన ప్రతీ ఒక్కరికీ మొహం వాచిపొయ్యేలా కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి.

ఈ సినిమాని తొక్కడానికి పచ్చ మీడియా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో మనమంతా చూసాము.మొదటి రోజు మన ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో మొదటి ఆటలు కూడా ప్రారంభం కాకముందే ఈ సినిమాకి 2 రేటింగ్స్ ఇచ్చారు.పరంగా చెత్తగా ఉంది అంటూ రివ్యూస్ రాసారు.అలాంటి రివ్యూస్ ఇస్తే చిరంజీవి కమర్షియల్ సినిమాని ఆపగలమేమో అని భ్రమపడ్డారు పాపం, కానీ మొదటి రోజు నుండి నేటి వరకు ఆ సినిమా రాబట్టిన వసూళ్లను చూసి ముక్కు మీద వేలు వేసుకొని మూలాన కూర్చున్నారు.

90 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అంటే బయ్యర్స్ కి అక్షరాలా 50 కోట్ల రూపాయిల లాభాలు అన్నమాట.ఏ నోటితో అయితే దురాభిమానుల ‘బాస్ అంటే లాస్’ అని కామెంట్స్ చేసారో, అదే నోటితో చిరంజీవి స్టార్ స్టేటస్ కి దండం పెట్టారు.ఒకటి రెండు ఫ్లాప్స్ తో కుప్పకూలిపొయ్యే సామ్రాజ్యం కాదని మరోసారి అందరికీ చెప్పకనే చెప్పాడు మెగాస్టార్.