Pawan vs Perni Nani : పవన్ కల్యాణ్ వేలు కదిలించినా, విమర్శించేందకు రెడీగా ఉండే పేర్ని నానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. వైసీపీలో మంత్రిగా చేసి పక్కకు నెట్టబడి మాజీగా మారినా, జనసేనానిపై విమర్శల దాడి మాత్రం తగ్గించలేదు. ఏ సామాజిక వర్గమైతే, ఆ సామాజిక వర్గ నేతలతో జగన్ తిట్టించడం అలవాటు. కాపు సామాజికవర్గమైన పేర్ని నాని చేత పవన్ కల్యాణ్ పై దుందుడుకుగా మాట్లాడిన ఆయన ఇప్పుడు తల పట్టుకుంటున్నారు.
మచిలీపట్నంలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. అధికారం శాశ్వతం కాదనే విషయం తెలిసినా, తనను తీవ్రంగా విమర్శించిన వైసీపీలోని కాపులను పవన్ కల్యాణ్ టార్గెట్ చేసినట్లు కనబడుతున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబును ముందుగా టార్గెట్ చేసి, ఆయన చేసిన అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృతకృత్యులయ్యారు. ఇప్పుడు పేర్ని నాని వంతు వచ్చినట్లుగా జన సైనికులు చెబుతున్నారు.
మచిలీపట్నంలో పేర్ని నానిని ఎలాగైన ఓడించేందుకు విపక్షాలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను ఇందుకు వేదిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 14న సభను నిర్వహించడం ద్వారా పేర్ని నానిని పూర్తిస్ధాయిలో టార్గెట్ చేయనున్నట్లు సమాచారం. పవన్ ఏదైనా సభ పెట్టినప్పుడు.. అరేయ్.. ఒరేయ్ అంటూ సంభోదిస్తూ హేళనగా పేర్ని నాని మాట్లాడటం, ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని పవన్ చాలా సందర్భాల్లో అన్నారు.
మచిలీ పట్నం సభ విజయవంతం చేసుకొని పవన్ కల్యాణ్ కాపు ఓట్లను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జనసేన అభ్యర్థిని ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన కొల్లు రవీంద్ర బలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పేర్ని నానికి జనసేన ఫీవర్ పట్టుకుంది. రాబోయే రోజుల్లో పవన్ ఇంకెవరిని టార్గెట్ చేస్తారోనని వైసీపీ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు.