
#RRR : రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా విడుదలై ఈ నెల 25 వ తారీకుతో సంవత్సరం పూర్తి అవుతుంది.కానీ ఈ సినిమా ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.రీసెంట్ గా ఈ సినిమాకి అంతర్జాతీయ అవార్డ్స్ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి క్యూ కట్టేస్తున్నాయి.గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్,హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఇలా అన్ని ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో తన సత్తా చాటింది.
మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకోనుంది.’బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్స్ కి నామినేట్ అయినా సంగతి తెలిసిందే.ఈ నెల 12 వ తేదీన జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కుతుందా లేదా అనేది తెలిసిపోతుంది..అయితే ఆస్కార్ ప్రొమోషన్స్ కోసం #RRR మూవీ ని మరోసారి అమెరికా వ్యాప్తంగా 200 థియేటర్స్ లో రీ రిలీజ్ చేసారు.
ఈ రీ రిలీజ్ కి అమెరికన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తున్నది.లాస్ ఏంజిల్స్ లో సుమారుగా 1647 సీటింగ్ కెపాసిటీ తో ప్రపంచంలోనే అతి పెద్ద థియేటర్ గా పేరు గాంచిన ఒక థియేటర్ టికెట్స్ మొత్తం హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోగా, తర్వాతి షో కోసం జనాలు రోడ్ల బయట క్యూలైన్స్ లో బారులు తీసిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని ఊపేస్తోంది.
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని రీ రిలీజ్ చేసిన ఇంత రెస్పాన్స్ వస్తుందో లేదో తెలియదు కాదు, అమెరికా లో మాత్రం మరో వంద సార్లు రీ రిలీజ్ చేసినా అక్కడి జనాలు క్యూ కట్టేస్తారు అని మాత్రం అర్థం అవుతుంది.ఈ రేంజ్ రెస్పాన్స్ ని బహుశా రాజమౌళి కూడా ఊహించి ఉండదు.నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చెయ్యడం వల్ల ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో ఈ రేంజ్ గుర్తింపు లభించింది అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు.