Walthair Veeraiah Collections : ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్..’వాల్తేరు వీరయ్య’ ప్రభంజనం ఇప్పట్లో ఆగదు

Walthair Veeraiah Collections : రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయేసరికి చిరంజీవి పని ఇక అయిపోయిందని చాలామంది సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేసారు.. కానీ ఒకటి రెండు సినిమాలు సరిగా ఆడకపోయి కూలిపొయే ఫ్యాన్స్ బేస్ కాదు ఆయనది.. నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని నిర్మించుకున్న సామ్రాజ్యం అది..  ఒక్క హిట్ తగిలితే ఇండస్ట్రీలో ఒక్క రికార్డు కూడా మిగలదు అని అభిమానులు నమ్మకంతో ఉండేవారు. ఆ నమ్మకం ఈరోజు […]

Written By: NARESH, Updated On : January 17, 2023 9:18 pm
Follow us on

Walthair Veeraiah Collections : రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయేసరికి చిరంజీవి పని ఇక అయిపోయిందని చాలామంది సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేసారు.. కానీ ఒకటి రెండు సినిమాలు సరిగా ఆడకపోయి కూలిపొయే ఫ్యాన్స్ బేస్ కాదు ఆయనది.. నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని నిర్మించుకున్న సామ్రాజ్యం అది..  ఒక్క హిట్ తగిలితే ఇండస్ట్రీలో ఒక్క రికార్డు కూడా మిగలదు అని అభిమానులు నమ్మకంతో ఉండేవారు.

ఆ నమ్మకం ఈరోజు ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో నిజమైంది.. జనవరి 13వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనాన్ని చూసి చిరంజీవిని ద్వేషించేవాళ్ళు కూడా నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండే పరిస్థితి ఏర్పడింది.. పండగ సెలవలు దాదాపుగా ముగిసినట్టే.. ఈరోజు కలెక్షన్స్ కాస్త తగ్గుతాయి అని అనుకున్నారు.. కానీ ‘వాల్తేరు వీరయ్య’ తో పాటుగా విడుదలైన సినిమాలు కొన్ని ప్రాంతాలలో తగ్గిపోయాయి కానీ, వీరయ్య విజృంభణ మాత్రం ఆగలేదు.

5వ రోజు కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించేసింది.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 90 కోట్ల రూపాయిల వరకు జరిగింది.. ఇప్పటికే నైజాం మరియు ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో నిన్ననే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టింది.. ఇక ఈరోజుతో మిగిలిన ప్రాంతాలలో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి వచ్చేసినట్టు సమాచారం.

నాలుగు రోజులకు గానూ సుమారుగా 75 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, 5 రోజులకు కలిపి 88 కోట్ల రూపాయిల వరకు షేర్ ని వసూలు చేసిందని అభిమానులు చెప్తున్నారు.. అంటే బ్రేక్ ఈవెన్ మార్కు కి చాలా దగ్గరగా ఈ సినిమా వచ్చేసినట్టు తెలుస్తోంది.. ఫుల్ రన్ లో ఈ చిత్రం మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని.. కచ్చితంగా 150 కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్ ని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.