Walthair Veeraiah : ‘వాల్తేరు వీరయ్య’ 6 రోజుల వసూళ్లు.. తన రికార్డ్స్ ని తానే బద్దలు కొట్టుకున్న మెగాస్టార్

Walthair Veeraiah : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపేస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే..మెగాస్టార్ కమర్షియల్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం. అంతే కాకుండా చిరంజీవి గత రెండు చిత్రాలు సరిగా ఆడకపొయ్యేసరికి, ఆయన పని […]

Written By: NARESH, Updated On : January 18, 2023 8:52 pm
Follow us on

Walthair Veeraiah : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపేస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే..మెగాస్టార్ కమర్షియల్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం.

అంతే కాకుండా చిరంజీవి గత రెండు చిత్రాలు సరిగా ఆడకపొయ్యేసరికి, ఆయన పని అయ్యిపోయింది అంటూ కామెంట్ చేసిన కొంతమంది దురభిమానులకు కూడా ఈ సినిమా ఒక సమాధానం గా నిలిచింది..నిన్న తూర్పు గోదావరి జిల్లాలో థియేటర్స్ సరిపోక చాలా చోట్ల అర్థరాత్రి షోస్ ని కూడా ప్రదర్శించారంటే మెగాస్టార్ మాస్ విద్వంసం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు..ఇప్పటి వరకు 6 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాలవారీగా ఇప్పుడు మన చూద్దాం.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
————————-
నైజాం 24.00 కోట్లు
సీడెడ్ 14.30 కోట్లు
ఉత్తరాంధ్ర 10.00 కోట్లు
ఈస్ట్ 7.40 కోట్లు
వెస్ట్ 4.10 కోట్లు
నెల్లూరు 2.79 కోట్లు
గుంటూరు 6.00 కోట్లు
కృష్ణ 4.27 కోట్లు
———————–
మొత్తం 72.86 కోట్లు

ఓవర్సీస్ 10.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 6.20 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 89.56 కోట్లు

చాలాకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన రేంజ్ మార్కెట్ కి దగ్గ వసూళ్లను చూసాడు..ఈ వీకెండ్ తో ఆయన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ద్వారా మూడవ వంద కోట్ల సినిమాని అందుకోబోతున్నాడు..గతం లో ఆయన హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ , ‘సైరా నరసింహా రెడ్డి’ వంటి సినిమాలు వంద కోట్ల షేర్ మార్కుని అందుకున్నాయి.. 70 ఏళ్ళ వయస్సుకు దగ్గరపడుతున్నప్పటికీ కూడా ఇన్ని వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలను సాధించాడంటే మెగాస్టార్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఈ రేంజ్ స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్న ఏకైక సీనియర్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే..ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా తన సత్తాని చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.