Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది..వింటేజ్ మెగాస్టార్ మార్క్ మాస్, కామెడీ టైమింగ్ మరియు డ్యాన్స్ తో అభిమానులను ఉర్రూతలూ ఊగించిన ఈ సినిమాకి అమెరికా నుండి అనకాపల్లి వరకు బంపర్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది..ముఖ్యంగా ఓవర్సీస్ లో గత రెండు చిత్రాల వల్ల మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ కాస్త డల్ అవ్వగా, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తో ఆయనకీ మళ్ళీ ఓపెనింగ్స్ లో మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా చేసింది.

కేవలం గురువారం ప్రదర్శించిన ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి దాదాపుగా 7 లక్షల డాలర్లు వచ్చాయి..మొన్న విడుదలైన ‘వీర సింహా రెడ్డి’ సినిమా కంటే బాగా తక్కువ షోస్ ఇవ్వడం వల్లే ఊహించిన దానికంటే కాస్త తగ్గిందని, కానీ మొదటి రోజు వసూళ్లు మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
కేవలం అమెరికా నుండే ఈ సినిమాకి ప్రీమియర్స్ + మొదటి రోజు కి కలిపి దాదాపుగా 1 మిలియన్ డాలర్స్ వచ్చాయి..అంటే మొదటి రోజు దాదాపుగా మూడు లక్షల డాలర్లను వసూలు చేసింది అన్నమాట..ఇక శనివారం అమెరికా లో ఒక హిట్టు సినిమాకి అద్భుతమైన వసూళ్లు వస్తాయి..అందుకే ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి కేటాయించిన షోస్ లో 30 శాతం వరకు ‘వాల్తేరు వీరయ్య’ కి కేటాయించారట..రెండు సినిమాలకు చాలా టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తే అసలు పోటీనే లేకుండా ‘వాల్తేరు వీరయ్య’ వీర విహారం చెయ్యడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

శనివారం రోజు ఈ సినిమాకి 5 లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉందని..వీకెండ్ పూర్తయ్యేసరికీ రెండు మిలియన్ డాలర్లకు చేరువ అవుతుందని సమాచారం..సోమవారం కూడా అమెరికా లో హాలిడే ఉండడం తో ఆ రోజు కూడా ఈ చిత్రానికి బాగా హెల్ప్ అవుతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 1.5 మిలియన్ డాలర్స్ మాత్రమే వసూలు చెయ్యాలి.