Waltair Veerayya- Veera Simha Reddy OTT: సంక్రాంతి చిత్రాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే పండగ సీజన్ ని క్యాష్ చేసుకున్నాయి. బాలయ్య, చిరంజీవి బాక్సాఫీస్ దుమ్ములుపుతున్నారు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య రికార్డు బ్రేకింగ్ వసూళ్లు రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో అంచనాలకు మించి ఆదరణ దక్కించుకుంటుంది. యూఎస్ లో వాల్తేరు వీరయ్య $ 2 మిలియన్ మార్క్ కి చేరువైంది. అదే సమయంలో వీరసింహారెడ్డి $1 మిలియన్ దాటలేదు. ఓపెనింగ్ వసూళ్లలో వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య మూవీ కంటే ఎక్కువ వసూళ్లు నమోదు చేసింది.

బాలయ్య అభిమానులు ఓపెనింగ్ రికార్డు కోసం కోట్లలో సొంత డబ్బులు ఖర్చు చేసి పెద్ద మొత్తంలో టికెట్స్ బుక్ చేశారన్న వాదన వినిపించింది. బల్క్ లో వీరసింహారెడ్డి టికెట్స్ బుక్ చేశారని. ఆన్లైన్లో టికెట్స్ బుక్ అయినట్లు చూపిస్తుండగా థియేటర్స్ లో మాత్రం ఆడియన్స్ కనిపించలేదన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ అనుమానాలు నిజం చేసేవిగా వసూళ్లు ఉన్నాయి. ఏదో మొదటి రోజు అంటే టికెట్స్ బల్క్ లో బుక్ చేయగలరు కానీ లాంగ్ రన్ లో డబ్బులు వెచ్చించడం ఎవరి వల్లా కాదు.
దీంతో వాస్తవంగా డిమాండ్ ఉన్న వాల్తేరు వీరయ్య బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాన్ని ఓవర్ కమ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫేక్ హైప్ క్రియేట్ చేసిన వీరసింహారెడ్డి వెనకబడింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. చాలా ఏరియాల్లో వాల్తేరు వీరయ్యకు అదనపు థియేటర్స్ కేటాయిస్తున్నారు. వాల్తేరు వీరయ్య స్థాయిలో వీరసింహారెడ్డి చిత్రానికి ఫుట్ ఫాల్స్ లేవు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతి చిత్రాల ఓటీటీ డీటెయిల్స్ బయటకు వచ్చాయి.

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హాట్ స్టార్, నెట్ఫ్లిక్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. హాట్ స్టార్ ఫ్యాన్సీ ధరకు వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది. ఇక వాల్తేరు వీరయ్య నెట్ఫ్లిక్స్ ఖాతాలోకి వెళ్ళింది. జయాపజయాలతో సంబంధం లేకుండా విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ లెక్కన ఫిబ్రవరి మూడు వారంలో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు ఓటీటీలో సందడి చేయడం ఖాయం. వీరసింహారెడ్డి చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు కాగా, వాల్తేరు వీరయ్యకు కె ఎస్ రవీంద్ర దర్శకత్వం వహించారు. రెండు చిత్రాల్లో శృతి హీరోయిన్ కావడం విశేషం.