https://oktelugu.com/

Waltair Veerayya Trailer : ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ డైలాగ్ లీక్..మెగాస్టార్ మాస్ మామూలుగా లేదు

Waltair Veerayya Trailer : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ నెల 13 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ బాషలలో విడుదల కాబోతుంది..ఈ సినిమా పై ఫ్యాన్స్ లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..ఎందుకంటే వింటేజ్ మెగాస్టార్ ని ఎవరు మాత్రం ఇష్టపడకుండా ఉండగలరు చెప్పండి..రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కామెడీ చెయ్యడం మానేసాడు..అన్నీ సీరియస్ రోల్స్ పడ్డాయి. ఖైదీ నెంబర్ 150 లో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2023 / 10:35 PM IST
    Follow us on

    Waltair Veerayya Trailer : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ నెల 13 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ బాషలలో విడుదల కాబోతుంది..ఈ సినిమా పై ఫ్యాన్స్ లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..ఎందుకంటే వింటేజ్ మెగాస్టార్ ని ఎవరు మాత్రం ఇష్టపడకుండా ఉండగలరు చెప్పండి..రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కామెడీ చెయ్యడం మానేసాడు..అన్నీ సీరియస్ రోల్స్ పడ్డాయి.

    ఖైదీ నెంబర్ 150 లో చేసాడు కానీ అది తన రేంజ్ మాత్రం కాదు..ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో అదే రేంజ్ కామెడీ టైమింగ్ ,అదే రేంజ్ మాస్ ని బయటకి తీసాడు మెగాస్టార్..అందుకే ఈ సినిమాపై అభిమానుల్లో ఆ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి..అగ్నికి ఆజ్యం తోడు అయ్యినట్టు ఈ సినిమాలో మెగాస్టార్ కి రవితేజ కూడా తోడు అయ్యాడు..ఇక బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రేపు విడుదల చెయ్యబోతున్నారు..ఈ ట్రైలర్ లో మెగాస్టార్ మార్క్ కి సంబంధించి ప్రతీ ఒక్కటి ఉంటుందట..అదిరిపొయ్యే డ్యాన్స్ స్టెప్స్ తో పాటుగా, మెగాస్టార్ మాస్ డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే రేంజ్ లో ఉంటాయట.

    ఈ ట్రైలర్ లో చిరంజీవి రవితేజ ఇడియట్ సినిమాలోని డైలాగ్ ని ఇమిటేట్ చేసి చెప్తాడు..’సిటీ కి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు..కానీ ఈ వీరయ్య లోకల్’ అంటూ రవితేజ తో అంటాడట మెగాస్టార్..ఇది ట్రైలర్ కి హైలైట్ గా నిలవబోతుంది..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..రేపు ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉంటే మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ కి చేరుకుంటుందనే చెప్పొచ్చు..చూడాలి మరి మెగాస్టార్ ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ రేంజ్ లో కొట్టబోతున్నాడు అనేది.