Waltair Veerayya Title Song: వాల్తేరు వీరయ్య చిత్రం నుండి వస్తున్న ఒక్కో సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంటుంది. ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ అనే మాస్ ఐటెం నంబర్ విడుదల చేసిన చిత్ర యూనిట్… రెండవ పాటగా ‘శ్రీదేవి చిరంజీవి’ అంటూ డ్యూయట్ రిలీజ్ చేశారు. తాజాగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ తో వచ్చారు మేకర్స్. సినిమాలో చిరంజీవి పాత్ర స్వభావం తెలియజేసేలా దేవిశ్రీ అద్భుతంగా కంపోజ్ చేశారు. చిరు ఇమేజ్ ని ఎలివేట్ చేసేలా సాంగ్ చక్కగా కుదిరింది. ఇక చంద్రబోస్ ఇచ్చిన సాహిత్యం అదిరిపోయింది. మొత్తంగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్… అభిమానుల అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్ళేదిగా ఉంది.

ఈ సాంగ్ కి ఉన్న మరొక విశేషం… వాల్తేరు వీరయ్య కొత్త గెటప్ ఇంట్రడ్యూస్ చేశారు. మొదటి నుండి ఈ చిత్రంలో చిరుని లుంగీ ధరించి ఊరమాస్ అవతార్ గా ప్రజెంట్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లో మాత్రం ఆయనను ఓ డాన్ గా చూపించారు. గన్స్, ఎలివేషన్స్ తో చిరంజీవి మేనరిజం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి పాత్రలో ఊహించని షేడ్స్ ఉంటాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ని అనురాగ్ కులకర్ణి, పవిత్ర చారి పాడారు.
వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. బాలయ్య వీరసింహారెడ్డి ఒకరోజు ముందు 12న విడుదల అవుతుంది. చిరు-బాలయ్యలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీ-థమన్ కూడా పోటీపడుతున్నారు. బెస్ట్ ఆల్బమ్ ఇవ్వాలని, ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని చూస్తున్నారు. 2020 సంక్రాంతికి మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలు విడుదలయ్యాయి. మహేష్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించగా, అల్లు అర్జున్ కి థమన్ మ్యూజిక్ ఇచ్చాడు.

అప్పుడు థమన్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచాడు. అల వైకుంఠపురంలో మూవీ సాంగ్స్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి నుండి మూడు సాంగ్స్ వచ్చాయి. ప్రస్తుతానికి వాల్తేరు వీరయ్య సాంగ్స్ జనాల్లోకి వెళుతున్నాయి. ఫైనల్ రిజల్ట్ తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ మహరాజ్ రవితేజ విక్రమ్ సాగర్ ఏసీపీ గా కీలక రోల్ చేస్తున్నారు.
