Waltair Veerayya Collections: ఈ సంక్రాంతి కి భారీ అంచనాల నడుమ విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే..ఈ సినిమా మీద ముందు నుండి మూవీ యూనిట్ చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు కానీ, ఈ రేంజ్ సక్సెస్ సాదిస్తుందని మాత్రం ఎవ్వరు ఊహించలేకపోయారు..మెగాస్టార్ కమర్షియల్ సినిమా చేస్తే ఈ రేంజ్ ఉంటుందని అందరికీ అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం.

పండుగ సెలవలు అయిపోయిన వెంటనే కలెక్షన్స్ డ్రాప్ అవుతాయేమో అని అందరూ అనుకున్నారు..కానీ ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా హౌస్ ఫుల్స్ పెట్టింది..అంటే లాంగ్ రన్ ఇప్పట్లో ఆగదు అనే సంకేతాలు అన్నమాట..10 రోజులకు 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయిలు అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
నిన్న కూడా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..ఈరోజు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి..ప్రస్తుతం ఉన్న మార్నింగ్ షోస్ ట్రెండ్ ని బట్టీ చూస్తే ఈ చిత్రానికి ఈరోజు కూడా రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.

కరోనా తర్వాత #RRR కి మించి చాలా చోట్ల అద్భుతమైన రన్ ని రాబడుతున్న ఏకైక సినిమా ‘వాల్తేరు వీరయ్య’ మాత్రమే అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు..ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలలో అయితే ఫుల్ రన్ #RRR కలెక్షన్స్ ని కూడా దాటేసే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతానికి ఈ సినిమా అక్కడ 11 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించింది..ఫుల్ రన్ లో కచ్చితంగా 14 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అంటున్నారు..చూడాలిమరి.