Dil Raju Second Marriage: ఐదు పదుల వయసులో దిల్ రెండో వివాహం చేసుకోవడం సంచలనం రేపింది. ఆయన మరో వివాహం చేసుకుంటున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. వార్తలపై ఆయన నోరు మెదపలేదు. ప్రచారమైనట్లే 2020లో తేజస్విని అనే అమ్మాయిని దిల్ రాజు అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసిన టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించారు. మహేష్, ప్రభాస్ వంటి బడా బడా స్టార్స్ ఆయన వివాహ రిసెప్షన్ కి హాజరయ్యారు.

దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో అనారోగ్యంతో మరణించారు. హన్షిత ఆయనకు ఒక్కగానొక్క కూతురు. వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో కూతురు హన్షితకు తండ్రి దిల్ రాజు రెండో వివాహం చేసుకోవడం ఇష్టమేనా అనే సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే తండ్రి జీవితంలోకి బయట మహిళ వస్తే తనను ఆదరిస్తుందా? ఆస్తిపాస్తులు నాకు చెందనిస్తుందా? వంటి అనేక సందేహాలు ఏర్పడతాయి. అయితే దిల్ రాజు రెండో వివాహం చేసుకోవడం వెనుక ప్రధాన పాత్ర వహించింది కూతురేనట.
ఒక మారీడ్ ఉమన్ గా జీవితంలో తోడు ఎంత అవసరమో ఆమెకు తెలిసిందట. తండ్రి ఒంటరిగా ఉండలేరని, అది ఎంత కష్టమో ఆమెకు అవగాహన ఉందట. దీంతో పట్టుబట్టి దిల్ రాజుని సెకండ్ మ్యారేజ్ కి ఒప్పించారట. మొదట్లో ఆయన ససేమీరా అన్నారట. దిల్ రాజు పేరెంట్స్ సైతం హన్షిత ఆలోచనకు మద్దతు పలికారట. దాంతో దిల్ రాజు తేజస్విని వివాహం చేసుకున్నారు. కాగా ఆమెతో దిల్ రాజుకు ఒక అబ్బాయి పుట్టారు. కూతురు పిల్లల కంటే దిల్ రాజు కొడుకు చిన్నవాడు కావడం విశేషం.

ఇక తేజస్విని తమ కుటుంబంలో బాగా కలిసిపోయిందట. స్టెప్ మదర్ తేజస్విని పట్ల హన్షిత చాలా సంతృప్తిగా ఉన్నారట. ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టిన దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. దేశంలోని పలు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఆయన బ్యానర్లో తెరకెక్కిన వారసుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన భారీ విజయం సాధించింది. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50వ చిత్రం రామ్ చరణ్ తో చేస్తున్నారు. శంకర్ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు.