Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల వర్షం అంతా ఇంతా కాదు..మెగాస్టార్ దాటికి నాన్ రాజమౌళి రికార్డ్స్ అన్నీ చాలా చోట్ల బ్రేక్ అవుతున్నాయి..కొన్ని చోట్ల అయితే #RRR సినిమా రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి అంటే మామూలు విషయం కాదు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది..అక్కడ మొదటి వారం దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.

ఇక 8 వ రోజు అనగా ఈరోజు కూడా ఈ సినిమాకి ఉత్తరాంధ్ర మొత్తం హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..ఇదే ఊపుని కొనసాగిస్తూ ముందుకు పోతే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో ‘అలా వైకుంఠపురంలో’ రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు..ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి..ఎన్నో హిట్స్ కొట్టారు..కానీ ఒక్కరు కూడా ‘అలా వైకుంఠపురం లో’ రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపొయ్యారు.
ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఆ సినిమా ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది..ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఆ రికార్డునే బద్దలు కొట్టబోతుందట..దీనినిబట్టీ చూస్తే ఆ ప్రాంతం లో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఇది ఇలా ఉండగా ఉత్తరాంధ్ర లోని కంచెరపాలెం లో ఊర్వశి అనే థియేటర్ లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం #RRR కలెక్షన్స్ ని దాటేసింది..అక్కడ ఈ సినిమా మొదటి వారం లో 31,50,000 రూపాయిలు వసూళ్లు వచ్చాయి..ఈ విషయం స్వయంగా థియేటర్ ఓనర్ పేపర్ యాడ్ వేయించాడు..ఇది ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు.

మరి ఫుల్ రన్ లో కూడా ఈ సినిమా ఉత్తరాంధ్ర లో #RRR రికార్డు ని బద్దలు కొడుతుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న..#RRR సినిమా ఉత్తరాంధ్ర ప్రాంతం లో 33 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..వచ్చే వారం రిపబ్లిక్ డే మరియు వీకెండ్ ఉంది కాబట్టి ‘అలా వైకుంఠపురంలో’ రికార్డు వరకు కొట్టొచ్చు..మరి #RRR ని కొడుతుందా లేదా అనేది తెలియాలంటే ఆ రేంజ్ లాంగ్ రన్ ఉండాలి..ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే ఆ స్థాయి లాంగ్ రన్ ఉండేలాగానే కనిపిస్తుంది..చూడాలిమరి.