Rajamouli: ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎన్నో అరుదైన గౌరవాలు అందుకుంటుంది. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతుంది. ఆర్ ఆర్ ఆర్ మాస్టర్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి రూపొందించిన మరో విజువల్ వండర్ గా పలువురు అభివర్ణిస్తున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కనీసం భారత్ తరపున ఆస్కార్ అధికారిక ఎంట్రీ దక్కలేదు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆర్ ఆర్ ఆర్ కి బదులు చల్లో షో(ది లాస్ట్ ఫిల్మ్ షో) చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నిర్ణయం ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ఎవరూ బయటపడి మాట్లాడింది లేదు.

తాజాగా దర్శకుడు రాజమౌళి ఈ విషయం పై స్పందించారు. ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి భారత్ తరపున ఆస్కార్ అధికారిక ఎంట్రీ దక్కనందుకు చాలా బాధపడ్డాను. నిరాశ చెందాను. మా చిత్రాన్ని ఎందుకు ఎంపిక చేయలేదని మేము ఆలోచించే వ్యక్తులం కాదు. బాధపడుతూ అక్కడే కూర్చోలేం. జరిగిందేదో జరిగింది, మేము ముందుకు సాగిపోవాలి. జ్యూరీ సభ్యులు చల్లో షో చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కి పంపారు. దానికి మేము సంతోషించాము. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? అనేది నాకు తెలియదు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడను అన్నారు.
చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడిన రాజమౌళి… ఎక్కడో మనసు లోతుల్లో ఉన్న అసహనాన్ని బయటపెట్టారు. రాజకీయ ఒత్తిడుల కారణంగా చల్లో షో సినిమాను ఎంపిక చేసి ఆర్ ఆర్ ఆర్ పక్కన పెట్టారనే వాదన ఉంది. అలా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. భారతదేశంలో ప్రతి చోట ఈ పక్షపాతం అనేది వేళ్ళూనుకుపోయింది. అధికారిక ఎంట్రీ దక్కకపోయినా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ జర్నీ ఆగలేదు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. సదరు సాంగ్ నామినేట్ అవుతుందని టీం గట్టి విశ్వాసంతో ఉన్నారు.

కాగా ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు చేరింది. నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అవార్డు గెలుచుకుంది. ఈ క్రమంలో ఆస్కార్ ఆశలు మరింత బలపడ్డాయి. నాటు నాటు నామినేషన్స్ సాధించిన నేపథ్యంలో దాదాపు ఆస్కార్ అందుకున్నట్లే. దర్శకుడు రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ దాదాపు రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది.