Waltair Veerayya Censor Review: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది..ఈ సినిమాలో చిరంజీవి తో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే..అన్నయ్య తర్వాత మళ్ళీ చిరంజీవి తో కలిసి ఆయన చేస్తున్న చిత్రం ఇది..ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తి అయ్యాయి..సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

ఈ సందర్భంగా సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము..మెగాస్టార్ చిరంజీవి ని అభిమానులు మరియు ఆడియన్స్ ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నారో, డైరెక్టర్ బాబీ అదే విధంగా ఈ సినిమా లో చూపించినట్టు తెలుస్తుంది..మెగాస్టార్ మార్క్ యాక్షన్ తో పాటుగా, కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయిందట..రౌడీ అల్లుడు కాలం నాటి మెగాస్టార్ కామెడీ టైమింగ్ ని ఈ సినిమాలో మనం చూడొచ్చని సెన్సార్ సభ్యుల నుండి వినిపిస్తున్న టాక్.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది అనే విషయం తెల్సిందే..చిరంజీవితో ఆమెకి ఇది మొట్టమొదటి సినిమా..ఈ మూవీ లో ఆమె పాత్ర హైలైట్ గా ఉంటుందట..కామెడీ టైమింగ్ కూడా శృతి హాసన్ కుమ్మేసినట్టు తెలుస్తుంది..ముఖ్యంగా ఈమె చిరంజీవి తో ఒక సన్నివేశం లో చేసే కామెడీ ఫైట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందట..ఫస్ట్ హాఫ్ మొత్తం అలా సరదాగా సాగిపోతున్న సమయం లో ఇంటర్వెల్ నుండి మెగాస్టార్ ఊర మాస్ యాక్షన్ మొదలవుతుందట.

రవితేజ ఎంట్రీ కూడా ఇంటర్వెల్ నుండే ఉండబోతుందని సమాచారం..ఇక సెకండ్ హాఫ్ లో చిరంజీవి మరియు రవితేజ మధ్య మంచి బాండింగ్ ఉన్న సన్నివేశాలను డైరెక్టర్ చాలా చక్కగా తెరకెక్కించాడట..వాళ్ళ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరట..మొత్తం మీద సెన్సార్ రివ్యూ ఒక్కమాట లో చెప్పాలంటే, రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ కి పర్ఫెక్ట్ సినిమా అని అంటున్నారు.