Bandla Ganesh- Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమాని అనే సంగతి మన అందరికీ తెలిసిందే..ఒక నటుడిగా , నిర్మాతగా కన్నా ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగానే అందరికి తెలుసు..సినిమాల్లో చిన్న చిన్న కమెడియన్ రోల్స్ వేసుకునే బండ్ల గణేష్ రవితేజ ‘ఆంజనేయులు’ అనే సినిమా ద్వారా నిర్మాతగా మారాడు..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ అనే సినిమా తీసాడు..అది అప్పట్లో పెద్ద ఫ్లాప్ అయ్యింది.

ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా బండ్ల గణేష్ ని పిలిచి గబ్బర్ సింగ్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు..అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..2012 వ సంవత్సరం లోనే 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 2 గా నిలిచింది..బండ్ల గణేష్ ని నిర్మాతగా ఇండస్ట్రీ లో స్థిరపడేలా చేసింది ఆ చిత్రం.
ఆ చిత్రం తర్వాత బండ్ల గణేష్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఎన్నో సక్సెస్ లు అందుకున్నాడు..తనని నిర్మాతగా సరికొత్త జీవితాన్ని ఇచ్చినందుకు గాను బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని దేవుడిలాగా కొలవడం ప్రారంభించాడు..ఆయన ఇంట్లో ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫొటోలే ఉంటాయి..పవన్ కళ్యాణ్ మీద అంతటి అభిమానం చూపించే బండ్ల గణేష్ లో ఈమధ్య కొంత మార్పు వచ్చింది..తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈమధ్య చాలా సార్లు పరోక్షంగా ట్వీట్లు వేస్తున్నాడు..అది పవన్ కళ్యాణ్ పైనే అభిమానులు అనుకుంటున్నారు..అయితే లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ కి అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది నేను..ఆయనలో ఉన్న అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి..ఈయన మామూలోడు కాదురా నాయనా, సరైన సినిమా తీస్తే అద్భుతాలు జరుగుతాయి అని నమ్మింది నేను మాత్రమే..ఇప్పుడంటే గురూజీలు, బురుజీలు ఆయన చుట్టూ చేరారు’ అంటూ పవన్ కళ్యాణ్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పరోక్ష సెటైర్లు వేసాడు బండ్ల గణేష్.