Homeఎంటర్టైన్మెంట్Ravi Teja- Shakalaka Shankar: ఏదో ఫ్లోలో అనేశాను అన్నయ్యా... రవితేజకు షకలక శంకర్ క్షమాపణలు!

Ravi Teja- Shakalaka Shankar: ఏదో ఫ్లోలో అనేశాను అన్నయ్యా… రవితేజకు షకలక శంకర్ క్షమాపణలు!

Ravi Teja- Shakalaka Shankar: ఒక వివాదం మరో వివాదానికి దారి తీయడం అంటే ఇదేనేమో. మెగాస్టార్ చిరంజీవిని కించపరిచేలా మాట్లాడాడని బండ్ల గణేష్ ని విమర్శించే క్రమంలో జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ మరో వివాదానికి తెరలేపారు. తప్పైపోయిందని నాలుక కరుచుకొని క్షమాపణలు చెప్పాడు. విషయంలోకి వెళితే… రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా సూపర్ హిట్ కొట్టింది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ధమాకా సక్సెస్ మీట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. చిత్ర యూనిట్ తో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు ఈ సక్సెస్ మీట్ కి హాజరయ్యారు. బండ్ల గణేష్ ఎప్పటిలాగే ప్రసంగంలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు.

Ravi Teja- Shakalaka Shankar
Ravi Teja- Shakalaka Shankar

బరువైన పదాలు, ప్రాసలు వాడుతూ రవితేజను ఆకాశానికి ఎత్తారు. రవితేజ ఎవరి సప్పోర్ట్ లేకుండా కష్టపడి స్టార్ అయ్యాడని చెప్పే క్రమంలో ఆయన ఓ మాట అన్నారు. ‘కొంత మంది రెండు మూడేళ్లలో అదృష్టం కలిసొచ్చి పెద్దగా కష్టపడకపోయినా… మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అయిపోతారు. రవితేజ అలా కాదు. ఏళ్ల తరబడి శ్రమించి, సచ్చినా బ్రతికినా పరిశ్రమలోనే అని నిలబడి స్టార్ అయ్యాడు” అని బండ్ల కామెంట్ చేశారు. మెగాస్టార్ అనేది చిరంజీవి బిరుదు కావడంతో కొందరు అభిమానులు హర్ట్ అయ్యారు.

బండ్ల గణేష్ కామెంట్ కి షకలక శంకర్ కౌంటర్ ఇచ్చాడు. ఓ మూవీ వేడుకలో పాల్గొన్న షకలక శంకర్… బండ్ల గణేష్ పేరు ఎత్తకుండా చురకలు వేశాడు. అదృష్టం వలన మెగాస్టార్లు కారు. ఏళ్ల తరబడి రేయింబవళ్ళు కష్టపడితే అవుతారు. ఎవడో ఒక హీరో ముందు కూర్చోగానే నోటికి వచ్చింది మాట్లాడతావా? అని ఫైర్ అయ్యాడు. షకలక శంకర్ ‘ఎవడో హీరో’ అనడాన్ని రవితేజ ఫ్యాన్స్ తప్పుబట్టారు. బండ్ల గణేష్ మాట్లాడింది, ఆయన ఎదురుగా ఉంది రవితేజనే కావడంతో షకలక శంకర్ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

Ravi Teja- Shakalaka Shankar
Ravi Teja- Shakalaka Shankar

ఈ క్రమంలో షకలక శంకర్ వివరణ ఇచ్చారు. రవితేజకు క్షమాపణ చెబుతూ వీడియో బైట్ విడుదల చేశాడు. రవితేజ అన్నయ్య అంటే నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఏదో మబ్బులో వాడు వీడు అని వచ్చేసింది. అంతకు మించి మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. మన అభిమాన హీరో గురించి మాట్లాడేటప్పుడు కూడా వాడు వీడు అనే పదాలు ఫ్లోలో వచ్చేస్తుంటాయి. ఏది ఏమైనా నా మాటలు కొందరిని హర్ట్ చేశాయి కాబట్టి నన్ను క్షమించండి, అని షకలక శంకర్ సదరు వీడియోలో మాట్లాడారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version