Maruti Wagon R: జీవితంలో కారు కొనాలనుకోవడం ఒకప్పడు కల. కానీ నేడు అవసరం. కాలం మారుతున్న కొద్దీ ఈ వెహికిల్ అవసరం ఏర్పడుతోంది. దీంతో సామాన్యుడు సైతం కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. కుటుంబ అవసరాలతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ వేయడానికి కారు బెటరని ఆలోచిస్తున్నారు. ఇక కరోనా పాండమిక్ సమయంలో ఇతర వాహనాల్లో వెళ్లి ఇబ్బందుల్లో పడడం కంటే సొంత వాహనాల్లో తిరగాలని చాలా మంది భావించారు. వారి డిమాండ్ కు అనుగుణంగా కార్ల అమ్మకాలు పెరిగాయి. అయితే ఎస్ యూవీ, లగ్జరీ కార్లతో పాటు మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ వినియోగదారులు మాత్రం ఆ కారునే కొనాలని చూస్తున్నారు. ఇంతకీ ఏ కారు?
కారు కొనాలనుకునేవారిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ లో బడ్జెట్ ఉండి అవసరాలు తీరాలని భావిస్తారు. హై రేంజ్ వారు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు మంచి ఫీచర్స్ కోసం ఎదురుచూస్తారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కంపెనీలు వారికి అనుగుణమైన కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇటీవల కాలంలో SUV(Sports Utilize Vehicle)లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. ఇవి ఆకర్షణీయంగా ఉండడంతో అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంటున్నాయి. అయితే వాటికి అనుగుణంగా ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి. దీంతో లో బడ్జెట్ లో కారు కొనాలనుకునేవారు వీటిని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
ఈ సందర్భంలో అటు స్మాల్ రేంజ్ కార్లకు, ఇటు ఎస్ యూవీలకు పోటీనివ్వకుండా మిడిల్ రేంజ్ లో మారుతి నుంచి వ్యాగన్ ఆర్ అమ్మాకాలు దూసుకుపోతుంది. వ్యాగన్ ఆర్ ఉన్నతమైన ఫీచర్స్ కలిగి ఉండి.. లో బడ్జెట్ లో అందుబాటులో ఉండడంతో దీని వైపు అన్ని వర్గాల వినియోగదారులు మళ్లుతున్నారు. ఫలితంగా వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎస్ యూవీలకు డిమాండ్ పెరుగుతన్నా.. వ్యాగర్ ఆర్ అమ్మకాలు జోరందుకోవడంతో ఆటోమోబైల్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మారుతి సుజుకీ ఉత్పత్త చేస్తున్న వ్యాగన్ ఆర్ పవర్ స్టీరింగ్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, పవర్ విండోస్ ఫ్రంట్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఎయిర్ కండిషనర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉన్నాయి. ఇది పెట్రోల్ ఫ్యూయల్ ను కలిగి ఉంది. లీటర్ పెట్రోల్ కు 24.43 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. 4 సిలిండర్ల సామర్థ్యం కలిగిన ఇందులో 88.50 బీహెచ్ పీ పవర్, ఫ్యూయల్ ట్యాంక్ 32 లీటర్ల ను లోడ్ చేసుకోవచ్చు. వ్యాగన్ ఆర్ ధర రూ.5,54,500 ప్రారంభ ధర ఉంది. సీటింగ్ కెపాసిటీ, సామర్థ్యం ఎక్కువ కలిగిని 7 లక్షల వకు విక్రయిస్తున్నారు. హై రేంజ్ వర్గాల పీపుల్స్ కు కూడా ఆకట్టుకునే ఫీచర్లను ఇది అందించడంతో చాలా మంది దీనిపైనే మనసు పారేసుకుంటున్నారు.