Mahesh And Namrata: చిరంజీవి ‘అంజి’ సినిమా మహేష్ – నమ్రత మధ్య ఇంత చిచ్చు రేపిందా!

Mahesh And Namrata: టాలీవుడ్ లో చూడ ముచ్చటగా ఉండే జంటలు ఏవి అనే లిస్ట్ తీస్తే అందులో మహేష్ – నమ్రత జంట ముందు వరుసలో ఉంటుంది.వీళ్లిద్దరి పెళ్లి ఎంత సింపుల్ గా జరిగిందో అందరికీ తెలిసిందే.ఎలాంటి హంగు మరియు ఆర్భాటం లేకుండా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షం లో ఈ వివాహం ఫిబ్రవరి 10 వ తారీఖున 2005 వ సంవత్సరం లో జరిగింది.’వంశీ’ చిత్రం ద్వారా వీళ్లిద్దరు తొలిసారి పరిచయమయ్యారు.అంతకు ముందు ఒకరికి […]

Written By: Vicky, Updated On : April 21, 2023 1:18 pm
Follow us on

Mahesh And Namrata

Mahesh And Namrata: టాలీవుడ్ లో చూడ ముచ్చటగా ఉండే జంటలు ఏవి అనే లిస్ట్ తీస్తే అందులో మహేష్ – నమ్రత జంట ముందు వరుసలో ఉంటుంది.వీళ్లిద్దరి పెళ్లి ఎంత సింపుల్ గా జరిగిందో అందరికీ తెలిసిందే.ఎలాంటి హంగు మరియు ఆర్భాటం లేకుండా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షం లో ఈ వివాహం ఫిబ్రవరి 10 వ తారీఖున 2005 వ సంవత్సరం లో జరిగింది.’వంశీ’ చిత్రం ద్వారా వీళ్లిద్దరు తొలిసారి పరిచయమయ్యారు.అంతకు ముందు ఒకరికి ఒకరు పరిచయం కూడా లేదట.

వంశీ మూవీ ముహూర్తపు సన్నివేశం అప్పుడే వీళ్లిద్దరి మీటింగ్ జరిగింది.అలా ఆ షూటింగ్ జరుగుతున్న సమయం లో ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు, ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకున్నారు.వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.మహేష్ అక్క మంజుల మొదటి నుండి నమ్రత కి మంచి స్నేహితురాలు.ఆమెకి కూడా వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్న సంగతి చెప్పలేదట,పెళ్లి వరకు అంత గోప్యంగా ఉంచారు ఈ విషయాన్నీ.

అయితే వీళ్లిద్దరి పెళ్లి చాలా హడావడిగానే జరిగింది,సరిగ్గా పెళ్లి కుదిరిన సమయం లో నమ్రత శిరోడ్కర్ మెగాస్టార్ చిరంజీవి తో ‘అంజి’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది.పెళ్లి ముందు రోజు వరకు కూడా ఆమె ‘అబ్బో నీ అమ్మ గొప్పదే’ సాంగ్ షూటింగ్ చేస్తూ ఉన్నింది.పెళ్లి పెట్టుకొని కూడా షూటింగ్ అవసరమా అంటూ అప్పట్లో మహేష్ బాబు పెద్ద లొల్లి పెట్టుకున్నాడట.

Mahesh And Namrata

ఎందుకంటే ఆయన కూడా అప్పుడు షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు, పెళ్ళికి ముందు రోజు రాత్రి వరకు ఆయన షూటింగ్ లోనే ఉన్నాడు, ఇద్దరూ షూటింగ్ లోనే ఉంటే అక్కడ ఎవరో ఒకరు ముందుగా ఉండాలి కదా అనేది మహేష్ అభిప్రాయం.ఎట్టకేలకు ఇద్దరు పెళ్ళికి ముందు రోజు రాత్రి సమయం లోనే కలుసుకున్నారు.సరిగ్గా పెళ్లి సమయానికి ఇద్దరూ అందుబాటులోనే ఉన్నారు.అలా వీళ్లిద్దరి పెళ్లి ఇంత హడావుడి మధ్య జరిగింది.