Vizag Lovers Bike Riding : నడిరోడ్డుపై బైక్ పై కూర్చొని ఆ పని చేసిన లవర్స్‌కు షాక్.. వీడియో

Vizag Lovers Bike Riding : రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందని అంటారు. ఇప్పుడు పరిస్థితి అలాగే మారింది. నాగరికత ముసుగులో మనం చేసే పనులు విచిత్రంగా ఉంటున్నాయి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసే శృంగారాన్ని నడిబజారుకు తెస్తున్నారు. ఫలితంగా అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆధునిక అలవాట్ల పేరుతో విచ్చలవిడి తనానికి దారులు తెరుస్తున్నారు. ప్రేమించుకున్న వారు కూడా ఏదో గుట్టుగా కలుసుకోవాలని తెలిసినా శృతిమించుతున్నారు. ఇటీవల […]

Written By: NARESH, Updated On : December 30, 2022 8:23 pm
Follow us on

Vizag Lovers Bike Riding : రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందని అంటారు. ఇప్పుడు పరిస్థితి అలాగే మారింది. నాగరికత ముసుగులో మనం చేసే పనులు విచిత్రంగా ఉంటున్నాయి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసే శృంగారాన్ని నడిబజారుకు తెస్తున్నారు. ఫలితంగా అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆధునిక అలవాట్ల పేరుతో విచ్చలవిడి తనానికి దారులు తెరుస్తున్నారు. ప్రేమించుకున్న వారు కూడా ఏదో గుట్టుగా కలుసుకోవాలని తెలిసినా శృతిమించుతున్నారు.

ఇటీవల కాలంలో ప్రేమికుల అల్లరి అందరికి అసహ్యం పుట్టిస్తోంది. సిన్సియర్ గా ఉండాల్సిన జంటలు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. పట్టపగలే రొమాన్స్ చేస్తూ పట్టుబడుతున్నారు. ఇదేంటంటే బిక్కమొహం వేస్తున్నారు. అలుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లు ఎలా పడితే అలా ప్రవర్తించడమెందుకు దొరికాక తల వంచుకోవడమెందుకు? ప్రేమపేరుతో నడిరోడ్డుపై చేసే హంగామా చేస్తూ అడ్డదిడ్డంగా నడుచుకుని చివరకు పోలీస్ స్టేషన్ కు చేరడం వింత గొలుపుతోంది. తమ ప్రేమకు ఎల్లలు లేవని చెబుతూ ఇలా చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోడ్ లో ఓ ప్రేమ జంట హల్ చల్ చేసింది. అందరు ఉన్నారనే విషయం మరచి బైకుపై విన్యాసాలు చేసింది. ప్రేమికుడు ద్విచక్ర వాహనం నడుపుతుంటే ఆమె ట్యాంకు మీద కూర్చుని వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. నడిరోడ్డుపై బైక్ పై వెళుతూ ముద్దులు, హగ్గులు అంటూ బండి మీదనే అన్నీ కానిచ్చేశారు. సీక్రెట్ చేయాల్సిన వ్యవహారాలన్నింటిని బండి మీదే చేయడంతో అటు వెళ్లినా ప్రయాణికులు అడ్డుకొని వాళ్లకు గడ్డిపెట్టారు. వార్నింగ్ ఇచ్చారు.  దీంతో విషయం కాస్త పోలీసులకు చేరింది. దీంతో వారు ప్రేమజంటను పట్టుకుని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేయడం సంచలనాలకు కేంద్రంగా నిలిచింది. అడ్డగోలుగా వ్యవహరించిన వారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు.