Comet : మనకు కనిపించే ఆకాశం లో మేఘాలు, సూర్యుడు, చంద్రుడు మాత్రమే కాకుండా ఎన్నో అద్భుతాలు ఉంటాయి. అందులో నక్షత్రాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్, గ్రహ శకలాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. అయితే నవగ్రహాలలో భూమి మాత్రమే జీవరాశి నివాసానికి అనువుగా ఉంటుంది. అలాగని మిగతా గ్రహాలలో నీరు, ఇతరాలు లేవని కాదు. కాకపోతే ఆ గ్రహాలలో ఆక్సిజన్ ఉండదు. హీలియం, హైడ్రోజన్ వంటివి వివిధ రూపాలలో ఉంటాయి. అందువల్లే ఆ గ్రహాలలో మనుషులు జీవించడానికి ఎటువంటి వాతావరణం ఉంది? ఆ వాతావరణం లో మనుషులు జీవించడం సాధ్యమేనా? మనుషులు కాకుండా ఇతర జీవులు మనగడ సాగించడం కుదురుతుందా? అనే అంశాలపై చాలా సంవత్సరాలుగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల చంద్రయాన్ ప్రయోగం ద్వారా ఇస్రో సరికొత్త విషయాలను వెల్లడించింది. చంద్రుడి మీద నీటి జాడలను కనుగొన్నది. అయితే ఇస్రో చేసిన ప్రయోగాల ద్వారా ఇప్పటికిప్పుడు గొప్ప గొప్ప ఆవిష్కరణలు సాధ్యం కాకపోయినప్పటికీ.. భవిష్యత్తు కాలంలో మాత్రం అవి ఎంతగానో ఉపకరిస్తాయి.
అరుదైన దృశ్యం ఆవిష్కృతం
ఇక ఖగోళం విషయానికి వస్తే.. ఈనెల 12న ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది.. సుచిన్ షాన్ అట్లాస్ అనే తోకచుక్క భూమికి 44 మిలియన్ మైళ్ళ దూరం నుంచి వెళ్లనుంది. ఇదే విషయాన్ని నాసా వెల్లడించింది. 2023 లో సూర్యుడికి అత్యంత దగ్గరగా ఈ తోకచుక్క ప్రయాణించింది. ఆ సమయంలో దీనిని నాసా తొలిసారిగా గుర్తించింది. అక్టోబర్ 9 నుంచి 10 తేదీల మధ్య ఈ తోకచుక్క స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ తోకచుక్క మరో 80 వేల సంవత్సరాల తర్వాతనే భూమికి చేరువగా వస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ తోకచుక్క వల్ల భూమికి ఎటువంటి నష్టం లేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు..” అంతరిక్షంలో ఇలాంటి మార్పులు తరచూ చోటు చేసుకుంటాయి. ఉపగ్రహాల ద్వారానే ఈ విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతానికి సుచిన్ షాన్ తోకచుక్క భూమికి సమీపంలో వెళ్తోంది.. దీని వల్ల భూమికి ఎటువంటి నష్టం లేదు. మరో 80 వేల సంవత్సరాల తర్వాతనే ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ప్రత్యేకమైన టెలీ స్కోప్ లో మాత్రమే ఈ దృశ్యాలు కనిపిస్తాయి. తరచూ ఇలాంటి తోకచుక్కలు భూమికి సమీపంగా వెళ్తూనే ఉంటాయి.. అయితే కొన్ని మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అంతరిక్షంలో జరిగే మార్పుల వల్ల ఇలాంటి అద్భుతాలు తరచూ చోటు చేసుకుంటాయి.. బిగ్ బ్యాంగ్ కూడా ఇలానే ఏర్పడింది. అప్పుడే భూమి, ఇతర గ్రహాలు ఏర్పడ్డాయని” నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A rare wonder in the sky again after 80 years is a comet near the earth
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com