
Virupaksha Teaser Review: సాధారణంగా ఒక చిత్ర టీజర్ చూడగానే కథపై అవగాహన వస్తుంది. కానీ విరూపాక్ష టీజర్ ఆద్యంతం మిస్టీరియస్ గా సాగింది. ఒక ప్రాంత ప్రజలు అనుకోని సమస్యలో ఇరుక్కుంటారు. వారి సమస్యకు పరిష్కారం వెతుకుతూ హీరో బయలుదేరుతాడు. హీరో ప్రయాణం ఎక్కడ ముగిసింది? హీరో తెలుసుకున్న ఎవరికీ తెలియని దేవ రహస్యం ఏమిటనేది? సినిమా కథగా అనిపిస్తుంది. నేపథ్యం ఏమిటనేది అర్థం కాలేదు. సోసియో ఫాంటసీ, పాథలాజికల్ టచ్ ఉన్నట్లు తెలుస్తుంది. హారర్ ఎలిమెంట్స్, యాక్షన్ అంశాలు కూడా టీజర్ లో కనిపించాయి.
అసలు టైటిల్ తోనే చిత్ర యూనిట్ సినిమాకు మంచి ప్రచారం కల్పించారు. విరూపాక్ష అనే డిఫరెంట్ టైటిల్ ఎంచుకున్నారు. విరూపాక్ష అంటే ఒక దేవుడు. సర్వాంతర్యామి, శివుడు అనే అర్థం కూడా వస్తుంది. టైటిల్ లోగోలో యంత్రం, అందులో కన్ను కూడా ఉంది. బహుశా నిఖిల్ నటించిన కార్తికేయ సిరీస్ టైప్ మూవీ కావచ్చు. ఏదీ ఏమైనా విరూపాక్ష టీజర్ అదుర్స్. ఆద్యంతం గూస్ బంప్స్ కలిగించేలా సాగింది. సినిమా మీద అంచనాలు పెంచేసింది.

విరూపాక్ష చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. రిపబ్లిక్ మూవీ తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి వస్తున్న చిత్రం ఇది. రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, పొలిటికల్ థ్రిల్లర్స్ చేసిన ఆయన ఈ తరహా చిత్రం గతంలో చేయలేదు. ఇక బైక్ ప్రమాదానికి గురయ్యాక సాయి ధరమ్ నుండి వస్తున్న మొదటి చిత్రం కూడా ఇదే కావడం విశేషం.
విరూపాక్ష మూవీతో సాయి ధరమ్ తేజ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారనిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా కాలం అవుతుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విరూపాక్ష ట్రైలర్ మార్చి 1న విడుదల కావాల్సింది. సాయి ధరమ్ తేజ్ అభిమాని హఠాన్మరణం పొందిన నేపథ్యంలో నేటికి వాయిదా వేశారు. సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. బి. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఏప్రిల్ 21న విడుదల కానుంది.
