
Virupaksha Shows: విరూపాక్ష ప్రదర్శిస్తున్న థియేటర్ పై సాయి ధరమ్ తేజ్ అభిమానులు దాడి చేశారు. సమయానికి షో వేయకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఆదివారం విరూపాక్ష(Virupaksha) మూవీ చూసేందుకు ఆడియన్స్ హైదరాబాద్ లోని మూసాపేట్ ఏషియన్ లక్ష్మీకళ థియేటర్లోకి వెళ్లారు. ఫస్ట్ షో కోసం సాయంత్రం ఆరు గంటలకు ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్లారు. ఎంత సేపటికీ సినిమా వేయలేదు. గంటకు పైగా థియేటర్స్ లో ఎదురు చూసిన ఆడియన్సు కోపంతో ఊగిపోయారు.
విరూపాక్ష మూవీ ప్రదర్శన నిలిచిపోవడంతో ఆడియన్స్, సాయి ధరమ్(Sai Dharam Tej) అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. థియేటర్ పై రాళ్లతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. షో నిలిచిపోవడంతో డబ్బులు రీ ఫండ్ చేశారు. అయితే జీఎస్టీ, పార్కింగ్ ఫీజులు అంటూ సగం మాత్రమే తిరిగి చెల్లించారని ఓ ప్రేక్షకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వార్తలకు ఎక్కింది.
దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన విరూపాక్ష హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులను పలకరించారు. అదిరిపోయే ట్విస్ట్స్, టైట్ స్క్రీన్ ప్లే తో కార్తీక్ దండు విరూపాక్ష చిత్రాన్ని ఆసక్తికరంగా నడిపించారు. హీరోయిన్ సంయుక్త క్యారెక్టర్ లోని ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మొత్తంగా సాయి ధరమ్ ఖాతాలో హిట్ పడింది. విరూపాక్ష భారీ వసూళ్లు రాబడుతుంది.

2019లో సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే చిత్రంతో హిట్ కొట్టారు. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఆ చిత్రం నిలిచింది. అనంతరం ఆయనకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. చిత్రలహరి పర్లేదు అనిపించుకుంది. సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్ చిత్రాలు నిరాశపరిచాయి. విరూపాక్షతో ఆయన హిట్ ట్రాక్ ఎక్కారు. 2021లో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యారు. కోలుకునేందుకు నెలల సమయం పట్టింది. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో పాటు వినోదయ సితం రీమేక్ చేస్తున్నారు.