Homeట్రెండింగ్ న్యూస్Microsoft CEO Satya Nadella: ‘సత్య నాదేళ్ల’ విలాసవంతమైన భవనం చూస్తే కళ్లు జిగేల్.. ఎలా...

Microsoft CEO Satya Nadella: ‘సత్య నాదేళ్ల’ విలాసవంతమైన భవనం చూస్తే కళ్లు జిగేల్.. ఎలా ఉందో చూడండి

Microsoft CEO Satya Nadella
Microsoft CEO Satya Nadella

Microsoft CEO Satya Nadella: సత్యనాదేళ్ల.. ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఈయన మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా మారి భారతదేశం గర్వించేలా చేశాడు. దేశంలోని ప్రతి ఒక్కరూ సత్య నాదేళ్లను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన చేసే సంస్కరణలపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సత్య నాదేళ్ల పర్సనల్ విషయాలపై కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లేటేస్టుగా ఆయకున్న విలావంతమైన భవనం చూసి షాక్ అవుతున్నారు. ఈ భవనం విశేషాలేంటో తెలుసుకుందాం.

సత్యనాదేళ్ల చిన్నప్పటి నుంచే చురుకైన అబ్బయిగా పేరు తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువులో రాణించేవారు. తనకిచ్చిన స్వేచ్ఛతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా నా వెనుక తల్లిదండ్రులు ఉన్నారని సత్య నాదేళ్ల పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. అయితే చిన్నప్పుడు క్రికెట్ అంటే బాగా ఇష్టమున్న ఆయన చదువుపై ఆసక్తి చూపేవారు కాదు. కానీ కంప్యూటర్ విద్య బాగా నచ్చడంతో ఆయనకు చదువుపై ఇంట్రెస్ట్ పెరిగింది.

అలా ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన మాస్టర్స్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. ఆ తరువాత సాప్ట్ వేర్ రంగంలో ఉద్యోగం సంపాదించి పలు హోదాల్లో పనిచేశారు. ఆ తరువాత 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరి ఆ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులయ్యారు. సత్యనాదేళ్ల ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా మూలాలు మరిచిపోలేదు. ఆయన పలు సార్లు భారత్ కు వచ్చి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Microsoft CEO Satya Nadella
Microsoft CEO Satya Nadella

సత్యనాదేళ్ల అమెరికా పౌరసత్వం తీసుకున్న తరువాత బెల్లిలోని ఓ విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నారు. దీని విలువ దాదాపు 7.5 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 60 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. అధునాతన సౌకర్యాలు, పెద్ద ప్లాట్ స్క్రీన్ టీవీలు, సౌకర్యమైన సీటింగ్ ఉన్నాయి. పెరట్లో స్విమ్మింగ్ ఫూల్, గేమ్ రూంలు ప్రత్యేకంగా ఉన్నాయి.

సత్యం నాదేళ్లకు మొదటి నుంచి పుస్తకాలంటే బాగా ఇష్టం. ఆయన ఇంజనీరింగ్ చదువుకునే సమయంలో నిత్యం పుస్తకాల పురుగుగా మారేవారు. నిత్యం కొత్త విషయం తెలుసుకోవాలంటే పుస్తకాలు ఎంతో సహకరిస్తాయని అయన చెబుతారు. ఈ క్రమంలో ఆయనకు నచ్చిన పుస్తకాలన్నీ సేకరించారు. వాటిని నిల్వ చేసుకునేందుకు తన భవనంలో రెండు ఫ్లోర్లు కేటాయించడం విశేషం. సత్య నాదేళ్ల కు లైబ్రరీపై ఉన్న ఇంట్రెస్ట్ ను చూసి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల | Microsoft CEO Satya Nadella Named as Chairman

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version