https://oktelugu.com/

Virupaksha Movie Review : ‘విరూపాక్ష’ మూవీ ఫుల్ రివ్యూ

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సునీల్, అజయ్,రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ తదితరులు డైరెక్టర్ : కార్తీక్ దండు సంగీతం : అంజనీష్ లోకనాథ్ నిర్మాత : BVSN ప్రసాద్ Virupaksha Movie Review : థ్రిల్లర్ జానర్ సినిమాలు అంటే ఆడియన్స్ కి మొదటి నుండి ఎంతో మక్కువ.ఎందుకంటే అలాంటి సినిమాలు ఇచ్చే అనుభూతిని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా ఆ సినిమాలోని సన్నివేశాలు మనల్ని […]

Written By: , Updated On : April 21, 2023 / 09:49 AM IST
Follow us on

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సునీల్, అజయ్,రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ తదితరులు

డైరెక్టర్ : కార్తీక్ దండు
సంగీతం : అంజనీష్ లోకనాథ్
నిర్మాత : BVSN ప్రసాద్

Virupaksha Movie Review : థ్రిల్లర్ జానర్ సినిమాలు అంటే ఆడియన్స్ కి మొదటి నుండి ఎంతో మక్కువ.ఎందుకంటే అలాంటి సినిమాలు ఇచ్చే అనుభూతిని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా ఆ సినిమాలోని సన్నివేశాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి.అలా చాలా కాలం తర్వాత హారర్ అనుభూతిని టీజర్ మరియు ట్రైలర్ ద్వారా అనిపించిన చిత్రం ‘విరూపాక్ష’.సాయి ధరమ్ తేజ్ మరియు సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయ్యింది.విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు కలిగించిందో, విడుదల తర్వాత కూడా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా చూడబోతున్నాము.

కథ :

1979 మరియు 1991 మధ్యలో ‘రుద్రవణం’ అనే ఒక ఊరిలో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని సిద్ధం చేసిన కథ ఇది.కథలోకి వెళ్తే 1979 వ సంవత్సరం లో ఒక జంట గ్రామం లో చేతబడులు చేస్తుంది అని భావించి గ్రామస్తులందరూ ఆ జంటని సజీవ దహనం చేస్తారు.మంటల్లో కాలిపోతున్న సమయం లో ఆ జంట వచ్చే పుష్కరం లోపు ఈ గ్రామ ప్రజలందరూ చనిపోతారు, ఇదే మా శాపం అని శపిస్తారు.ఇక కథ 1979 నుండి 1991 వ సంవత్సరం లోకి అడుగుపెడుతుంది.ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా గ్రామం మొత్తాన్ని మంత్రం శక్తితో అష్టదిగ్బంధనం చేసినా కూడా వరుసగా హత్యలు జరుగుతూనే ఉంటాయి.ఈ హత్యలు చేస్తున్నది ఎవరు అని కనుక్కోవడానికి సూర్య ( సాయి ధరమ్ తేజ్) రంగం లోకి దిగుతాడు.అతను రంగం లోకి దిగిన తర్వాత కథలో ఎవ్వరూ ఊహించని ట్విస్టులు ఎదురు అవుతాయి.ఆ ట్విస్టులను థియేటర్ లో చూసి అనుభూతి చెందండి.

విశ్లేషణ :

మన చిన్నతనం లో ఉన్నప్పుడు మనల్ని తెగ భయపెట్టిన సినిమాలు ఏమిటి అంటే, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు ‘దెయ్యం’, ‘రాత్రి’ అంటాము.ఇంకా అడిగితే చంద్రముఖి మరియు అరుంధతి సినిమాలు కూడా మనల్ని థియేటర్స్ లో బాగా భయపెట్టాయి.ఆ తర్వాత వచ్చిన కొన్ని హారర్ సినిమాలు ఆ రేంజ్ థియేట్రికల్ అనుభూతిని మాత్రం మనకి కలిగించలేదు.రీసెంట్ గా వచ్చిన మసూదా పర్వాలేదు అనిపించింది కానీ,ఈ విరూపాక్ష చిత్రం మాత్రం ప్రేక్షకులను వణుకుపుట్టించే రేంజ్ సినిమా అని మాత్రం కచ్చితంగా చెప్పగలం.సినిమాకి ఉన్న టాక్ ఆడియన్స్ లో ఇంకా బలంగా వెళ్తే మాత్రం ఈ చిత్రం మరో చంద్రముఖి అరుంధతి రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అంత అద్భుతంగా థ్రిల్లింగ్ కి గురి అయ్యే విధంగా డైరెక్టర్ కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఇది ఆయనకీ మొదటి సినిమా అంటే మాత్రం ఎవ్వరూ నమ్మలేరు.

ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో సాయి ధరమ్ తేజ్ మరియు హీరోయిన్ సంయుక్త మీనన్ ఎంతో అద్భుతంగా నటించారు.ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్ సీట్ చివర కూర్చొని చూస్తారు.అంతలా సస్పెన్స్ కి గురి చేస్తుంది ఈ చిత్రం.ముఖ్యంగా హీరోయిన్ పాత్ర ఇచ్చే ట్విస్టు కి మన ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం.ఇక ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్ మరియు సౌండ్ మిక్సింగ్.వీటివల్ల ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతిని కలిగించింది.మొత్తం మీద హారర్ జానర్ మీద ఇటీవల తెరకెక్కిన సినిమాల్లో ‘విరూపాక్షా’ చిత్రం రీసెంట్ టైం లో ది బెస్ట్ అని చెప్పొచ్చు.

చివరి మాట: హార్రర్ సినిమాలు అంటే భయం ఉన్నవాళ్లు ఒంటరిగా మాత్రం ఈ చిత్రానికి వెళ్ళకండి.

రేటింగ్ : 3/5

Virupaksha Trailer (Telugu) | Sai Dharam Tej | Samyuktha | Karthik Dandu | Sukumar | Ajaneesh