https://oktelugu.com/

Ariyana Glory: రెచ్చిపోయిన బిగ్ బాస్ అరియనా… ఆర్జీవీ మామ చూస్తే నిన్ను వదలడంటూ కామెంట్స్!

Ariyana Glory: ఒక్క ఇంటర్వ్యూతో అరియనా గ్లోరీని ఓవర్ నైట్ స్టార్ ని చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు అరియనా ఎవరికీ తెలియదు. ఆమె యూట్యూబ్ ఛానల్స్ లో యాంకరింగ్ చేసుకునేవారు. అనుకోకుండా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. అరియనా అందాన్ని చూసి ఫిదా అయిన ఆర్జీవీ ఓ బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని కోరిక బయటపెట్టాడు. అరియనా సిగ్గు పడిపోయింది. ఆ వీడియో వైరల్ కాగా అరియనా వెలుగులోకి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 21, 2023 / 09:41 AM IST
    Follow us on

    Ariyana Glory

    Ariyana Glory: ఒక్క ఇంటర్వ్యూతో అరియనా గ్లోరీని ఓవర్ నైట్ స్టార్ ని చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు అరియనా ఎవరికీ తెలియదు. ఆమె యూట్యూబ్ ఛానల్స్ లో యాంకరింగ్ చేసుకునేవారు. అనుకోకుండా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. అరియనా అందాన్ని చూసి ఫిదా అయిన ఆర్జీవీ ఓ బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని కోరిక బయటపెట్టాడు. అరియనా సిగ్గు పడిపోయింది. ఆ వీడియో వైరల్ కాగా అరియనా వెలుగులోకి వచ్చింది.

    ఆ పాపులారిటీ ఆమెకు బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ తెచ్చిపెట్టింది. లాక్ డౌన్ సమయంలో ప్రసారమైన సీజన్ 4 కంటెస్టెంట్స్ కి కఠిన ఆంక్షలు పెట్టారు. హౌస్లోకి వెళ్లే ముందు రెండు వారాలు క్వారంటైన్ చేయాలని నిబంధనలు పెట్టారు. దీంతో పేరున్న సెలెబ్రిటీలు షోలో పాల్గొనే ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా పెద్దగా తెలియని ముఖాలు షోలో ఛాన్స్ దక్కించుకున్నారు. సీజన్ 4 కంటెస్టెంట్స్ ని గమనిస్తే అభిజీత్, మోనాల్, నోయల్, లాస్య, అవినాష్ తో పాటు ఒకరిద్దరు తప్పితే అందరూ అంతగా పాపులారిటీ లేనోళ్లే.

    అరియనా ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టి ఫైనల్ కి వెళ్లారు. అరియనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. తప్పును ప్రశ్నించే తత్త్వం ఆమెకు అభిమానులను తయారు చేసింది. ఒక దశలో టైటిల్ విన్నర్ గా ఆమె పేరు ప్రచారమైంది. అయితే 4వ స్థానంతో సరిపెట్టుకుంది. టైటిల్ కోల్పోయినా పాపులారిటీ రాబట్టింది. ఆమె కెరీర్ కి ఊపు వచ్చింది.

    Ariyana Glory

    ఇటీవల బీబీ జోడీలో కూడా అరియనా సత్తా చాటింది. అవినాష్-అరియనా జోడి ఫైనల్ కి వెళ్లారు. తృటిలో టైటిల్ కోల్పోయారు. ఫైమా-సూర్య విన్నర్స్ గా రూ. 25 లక్షలు దక్కించుకున్నారు. అరియనా జోడి రన్నర్స్ టైటిల్ తో సరిపెట్టుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అరియనా హాట్ ఫోటో షూట్స్ తరచుగా వైరల్ అవుతుంది. తాజాగా ఎల్లో ట్రెండీ వేర్ ధరించి ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టారు. అరియనా గ్లామరస్ ఫోటోలపై జనాలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

    ‘ఆర్జీవీ మామ చూశాడంటే మరోసారి ఇంటర్వ్యూ చేస్తాడు’ అని ఓ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు. ఆ మధ్య జిమ్ ఫిట్ లో అరియనాను ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. ఇది కాస్తా వైరల్ అయ్యింది. అరియనా తెగింపుకు అభిమానుల మైండ్ బ్లాక్ చేసింది.