Virupaksha Collections : ఈ సమ్మర్ లో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రం 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మళ్ళీ ఈ రేంజ్ వసూళ్లను చూస్తాడో లేదో తెలియదు కానీ, ఈ చిత్రాన్ని మాత్రం ఆయన ఎప్పటికీ మర్చిపోలేడు అని మాత్రం చెప్పగలం.
ఎందుకంటే ఆయన బైక్ ప్రమాదం జరిగిన తర్వాత థియేటర్స్ లో విడుదలైన మొట్టమొదటి చిత్రం ఇది.అంతటి ప్రమాదం తర్వాత కెరీర్ పరంగా ఆయనకీ పునర్జన్మ వచ్చినట్టే అని చెప్పొచ్చు.అయితే ఈ సినిమా ఇక్కడ విడుదలైన కొన్ని రోజుల తర్వాత హిందీ, తమిళం మరియు మలయాళం బాషలలో విడుదల చేసారు.
‘కాంతారా’ రేంజ్ లో ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధిస్తుందని అనుకున్నారు, కానీ సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఈ చిత్రం ప్రింట్స్ కి అయినా ఖర్చులను కూడా ఇతర బాషలలో రాబట్టలేకపోయింది. ముఖ్యంగా హిందీ లో ఈ చిత్రం క్లోసింగ్ కేవలం 40 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే,దీనిని షేర్ కి లెక్కగడితే కనీసం 12 లక్షల రూపాయిలు కూడా అవ్వలేదు.
హిందీ ప్రింట్ , డబ్బింగ్ మరియు ప్రొడక్షన్ కాస్ట్ కలిపి కనీసం ఒక్క రూపాయి కూడా మిగలలేదు. దీనితో ఈ చిత్రం హిందీ లో ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.ఒక మంచి సినిమాని సరైన పద్దతి లో ప్రమోట్ చెయ్యకపోతే ఇతర బాషలలో ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పడానికి ‘విరూపాక్ష’ చిత్రం ఒక ఉదాహరణ.భవిష్యత్తులో అయిన కంటెంట్ ఉన్న సినిమాలను మేకర్స్ జాగ్రత్తగా ప్రమోట్ చేసుకుంటారో లేదో చూడాలి.