Homeక్రీడలుVirat Kohli- Anushka Sharma: అనుష్క ను చూస్తూ విరాట్ కోహ్లీ చేసిన ఆ పని.....

Virat Kohli- Anushka Sharma: అనుష్క ను చూస్తూ విరాట్ కోహ్లీ చేసిన ఆ పని.. వైరల్ గా మారిన వీడియో..!

Virat Kohli- Anushka Sharma
Virat Kohli- Anushka Sharma

Virat Kohli- Anushka Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సీజన్ లో బెంగళూరు జట్టు గొప్పగా ఆడుతోంది. గతానికి భిన్నంగా ఈసారి జట్టు ప్రదర్శన కనిపిస్తోంది. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చరిత్ర చూస్తే.. గ్రీన్ కలర్ డ్రెస్ ఆ జట్టుకు పెద్దగా కలిసి రాదు. దానికి తోడు ఏప్రిల్ 23 కోహ్లీకి అసలే కలిసి రావడం లేదు. దీంతో ఆదివారం బలమైన రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయంపై అభిమానులకు అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఆదివారం జరిగిన చిన్నస్వామి స్టేడియంలో కూడా బెంగళూరు జట్టుకు మంచి రికార్డు ఏమీ లేదు. వీటికి తోడు ఆర్సీబీ జట్టు టాస్ కూడా ఓడిపోయింది. దీంతో జట్టు విజయం కష్టమేనని అభిమానులు కూడా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బెంగళూరు జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది.

ప్రతికూలతలు ఎన్ని ఉన్నప్పటికీ ఆర్సీబీ జట్టు ఆదివారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయి వెనుదిరిగాడు. గతంలో కూడా ఏప్రిల్ 23వ తేదీన జరిగిన మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఏప్రిల్ 23న జరిగిన మ్యాచ్ ల్లో గోల్డెన్ డకౌట్ గా వెనుతిరగడం కోహ్లీకి ఇది మూడోసారి. అయితే, ఆదివారం నాటి మ్యాచ్ లో ఫాఫ్ డూప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో 189 పరుగులు చేసింది. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు రాజస్థాన్ జట్టు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. బాల్ బౌండరీ లేదంటే సిక్స్ అన్నట్టుగా వీరిద్దరు చెలరేగిపోయారు. ఒక దశలో ఈ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 200కు పైగా పరుగులు చేస్తుందని అంతా భావించారు. అయితే వీరిద్దరు పెవిలియన్ కు చేరిన తర్వాత రాజస్థాన్ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు పెద్దగా రాలేదు. దీంతో 189 పరుగులకు మాత్రమే బెంగళూరు జట్టు పరిమితమైంది.

రాజస్థాన్ ను ఒత్తిడిలోకి నెట్టిన బెంగుళూరు బౌలర్లు..

190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు యువ ప్లేయర్లు దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్ చెలరేగి ఆడడంతో రాజస్థాన్ జట్టు విజయం సాధిస్తుందని అంతా భావించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 47 పరుగులు, దేవదత్ పడిక్కల్ 34 బంతుల్లో 52 పరుగులు, ద్రువ్ జ్యూరెల్ 16 బంతుల్లో 34 పరుగులు చేయడంతో విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. ఈ ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో విజయానికి ఎనిమిది పరుగుల దూరంలో రాజస్థాన్ జట్టు నిలిచిపోయింది. దీంతో బెంగళూరు జట్టు విజయం సాధించింది.

కోహ్లీ చేసిన పని నెట్టింట వైరల్..

ఈ మ్యాచ్ గెలవడంతో కోహ్లీ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మ్యాచ్ గెలిచిన తర్వాత సంతోషంతో ఊగిపోయిన కోహ్లీ.. స్టేడియంలో నిలబడి ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్సులు పంపించాడు. అది చూసిన అనుష్క తెగ సిగ్గు పడిపోయింది. ఆ తర్వాత వెళ్లి తోటి ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ను కోహ్లీ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. అనుష్కకు ఫ్లయింగ్ కిస్సులు పంపుతున్న కోహ్లీ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు అభిమానులు. కోహ్లీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుండడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Virat Kohli- Anushka Sharma
Virat Kohli- Anushka Sharma

ఆనందాన్ని ఆపుకోలేని కోహ్లీ..

విరాట్ కోహ్లీ సంతోషంగా ఉన్నప్పుడు విపరీతంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చినది చేయడం విరాట్ కోహ్లీకి ఉన్న అలవాటు. టీమ్ విజయాన్ని కోహ్లీ ఎప్పుడు గొప్పగానే ఫీలవుతుంటాడు. డెడికేషన్ తో ఆడే ఆటగాడు కాబట్టే.. కోహ్లీ విజయం వరించిన ప్రతిసారి గొప్పగా ఫీల్ అవుతాడని, ఆ ఆనందంలోనే తాజాగా తన భార్యకు ఫ్లయింగ్ కిస్సులు పంపించాడని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.

Exit mobile version