
Virat Kohli – Ganguly : బీసీసీఐలో లుకలుకలు ఉండటం ఇప్పటి విషయం కాదు. ఎప్పటి నుంచో టీమిండియాలో విభేదాలు కామన్ గానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి హయాంలోనైనా క్రికెటర్లలో మనస్పర్దలు రావడం సహజమే. దీనికి ఎవరు అతీతులు కారు. మొదటి నుంచి క్రికెటర్లలో ఒకరి కంటే ఒకరికి పడదు. వారి వ్యక్తిగత ఉద్దేశాలను మరొకరికి ఆపాదిస్తుంటారు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సౌరవ్ గంగూలీకి ఉన్న విభేదాలు తెలిసినవే.
విరాట్ కోహ్లి ఆర్సీబీకి సౌరవ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వారిద్దరి పోరాటం చూస్తే అందరికి ఆసక్తి కలిగింది. వారికి ఒకరంటే మరొకరికి పడదు. ఈనేపథ్యంలో వారి ఆటను చూసేందుకు అందరు ఇష్టపడ్డారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామం అందరిలో పలు ప్రశ్నలకు దారి తీసింది.
ఆట ముగిసిన తరువాత అందరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే విరాట్ కోహ్లి గంగూలీ మాత్రం షేక్ హ్యాండ్ కు దూరంగా ఉన్నారు. ఇది గమనించిన రికీ పాంటింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని సూచించినా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వెళ్లిపోవడం గమనార్హం. కెప్టెన్ గా రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వడంలో గంగూలీ పాత్ర ఉందనే వాదనలు కూడా ఉన్నాయి.
దీంతోనే గంగూలీ అంటే విరాట్ రెచ్చిపోతాడు. అతడిని కలిసేందుకు ఇష్టపడడు. ఎదురుపడితే విష్ చేయడు. ఎవరి దారి వారు చూసుకుంటారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక గంగూలీ విరాట్ ను కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు మార్గాలు అన్వేషించాడు. అదే సమయంలో విరాట్ పేలవ ఫామ్ అతడికి కలిసొచ్చిందని చెబుతారు. ఇలా గంగూలీ విరాట్ పై కసి తీర్చుకున్నాడనే ఆరోపణలు ఉండటం గమనార్హం.