Virat Kohli And Anushka Sharma: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు పాట ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చిన మడతపెట్టి..’ ఈ పాటకు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు రీల్స్ చేస్తూనే ఉన్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి లైక్స్, షేర్స్, కామెంట్స్ కోరుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసిన కుర్చిని మడతపెట్టి పాట రీల్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతలా ఈ పాట జనంలోకి వెళ్లింది. ఇప్పుడు ఈ పాటకు కింగ్ కోహ్లి తన భార్య అనుష్కతో కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్..
ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. నెల రోజులులైనా ఆ సినిమాలోని ‘కుర్చీని మడతపెట్టి.. ’ సాంగ్ ఇంకా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. ఆడియన్స్‌ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో లక్షల్లో ఈ పాటకు రీల్స్, షాట్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ పాటకు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి డాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఎడిట్ వీడియో..
అయితే ఈ వీడియో కోహ్లి–అనుష్క చేయలేదు. వారు చేసినట్లుగా ఎడిట్ చేశారు. గతంలో వీరు ఇద్దరూ కలిసి చేసిన డాన్స్‌కు ‘కుర్చిని మడతపెట్టి’ పాటను జోడించిన అభిమానులు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడది వైరల్ అవుతోంది. ప్రస్తుతం అనుష్క ప్రెగ్నెంట్. ఆమె డెలివరి కోసమే కోహ్లి ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వారు డెలివరీ కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో డాన్స్ ఎలా చేసిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది పాత డాన్స్ వీడియోకు పాటను జోడించినట్లు కొందరు చెబుతున్నారు. మొత్తానికి కోహ్లి – అనుష్క డాన్స్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమాలోని గుంటూరు కారం చిత్రంలోని పాట బాగా సెట్ అయిందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
Virat Kohli-Anushka Dance to Kurchi Madathapetti Song from Super Star Mahesh Babu’s Movie.#Fans edit video #ViratKohli#AnushkaSharma #KurchiMadathapetti #MaheshBabu pic.twitter.com/UFaPzxfVGW
— mahe (@mahe950) February 8, 2024